బాలయ్యతో చేయడం ఇష్టం లేక ఫోన్ స్విచాఫ్ పెట్టా, ఫ్యాన్స్ తిట్టారు: బాహుబలి ప్రభాకర్

By Bojja Kumar

Recommended Video

బాలయ్యతో చేయడం ఇష్టం లేక.. ఫోన్ స్విచాఫ్ పెట్టా..!

టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ గురించి తరచూ ఓ ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు చాలా కోపం అని, సెట్స్‌లో అందరిపై అరుస్తూ ఉంటారని, ఆయనతో చేయడానికి దర్శకులు, నటులు భయపడతారని...ఇలా రకరకాల ప్రచారం ఉంది. ఈ ప్రచారం విని కొందరు దర్శకులు, నటులు కూడా బాలయ్యతో చేయడానికి భయపడిన సందర్బాలు ఉన్నాయి. ఇలా భయపడ్డవారంతా ఆయనతో పని చేసిన తర్వాత తమ తమ అభిప్రాయాలు పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా బాహుబలి ఫేం ప్రభాకర్ బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

బాలకృష్ణకు మెయిన్ విలన్‌గా

బాలకృష్ణకు మెయిన్ విలన్‌గా

బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జై సింహ' చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రభాకర్ బాలయ్య గురించి తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘జై సింహ' చిత్రంలో తనకు చాలా మంచి రోల్ వచ్చిందని, మర్యాద రామన్న, బాహుబలి తర్వాత తనకు వచ్చిన బెస్ట్ రోల్ ఇదే అని ప్రభాకర్ తెలిపారు.

బాలయ్య అలాంటివారు కాదు

బాలయ్య అలాంటివారు కాదు

బాలకృష్ణ గారితో చేసేపుడు ఏ సీన్లోనూ తనబడలేదని, ఎదుటివారు తడబడే విధంగా బాలకృష్ణ ప్రవర్తించరని, తన తోటి నటులను ఎంకరేజ్ చేస్తారని, చాలా ఫ్రెండ్లీగా ఉంటారని ప్రభాకర్ తెలిపారు.

బాలయ్య సినిమాతో సినిమా అనగానే ఫోన్ స్విచాఫ్ పెట్టాను

బాలయ్య సినిమాతో సినిమా అనగానే ఫోన్ స్విచాఫ్ పెట్టాను

మర్యాద రామన్న షూటింగ్ జరిగే సమయంలోనే దాసరిగారి డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న ‘పరమ వీర చక్ర' సినిమాలో ఓ క్యారెక్టర్ చేయమని ఫోన్ వచ్చింది. అయితే అప్పటి నాకు బాలయ్య గురించి కొందరు చెప్పిన మాటలు విని ఆ సినిమాలో చేయడానికి భయ పడ్డాను, రిస్క్ ఎందుకని నా ఫోన్ స్విచాఫ్ పెట్టుకున్నానని ప్రభాకర్ తెలిపారు.

బాలయ్య గురించి అదంతా అబద్దం

బాలయ్య గురించి అదంతా అబద్దం

బాలయ్య సెట్లో చాలా సీరియస్ గా ఉంటారని, తోటి ఆర్టిస్టులపై ఫైర్ అవుతారని కొందరు చెప్పారని.... అయితే అదంతా అబద్దమని తర్వాత తెలిసిందని, ‘జై సింహ' సినిమాలో బాలయ్యతో కలిసి 29 రోజులు నటించాను. ఆయన్ను చాలా దగ్గర నుండి పరిశీలించాను. ఆయనది చాలా ఫ్రెండ్లీ నేచర్. అపుడు అనవసరంగా చాన్స్ మిస్ చేసుకున్నాననే ఫీలింగ్ కలిగిందని ప్రభాకర్ తెలిపారు.

బాలయ్య ఎనర్జీ సూపర్

బాలయ్య ఎనర్జీ సూపర్

బాలయ్యలో ఎనర్జీ సూపర్‌గా ఉంటుంది. ఆయన డైలాగులు చెబుతుంటే మనలోనూ ఇంకా బాగా చేయాలనే ఉత్సాహం వస్తుంది. ఆయనతో కంపేర్ చేసుకోవడం తప్పు, కాక పోతే ఆయనలా చేయాలనే ప్రయత్నం మాత్రం చేయాలి అని ప్రభాకర్ తెలిపారు.

బాలయ్యను కొట్టే సీన్

బాలయ్యను కొట్టే సీన్

‘జై సింహ' సినిమాలో ఫస్ట్ ఫైట్ సీన్లో బాలకృష్ణ గారు నన్ను కొట్టరు. నేనే ఆయన్ను కొడుతుంటాను. నేను కొడుతుంటే ఆయన గాల్లో ఎగిరిపోతూ ఉంటారు. ఆయన తిరిగి కొడతారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అలా జరుగదు. ఈ సీన్ చూసి అభిమానులు చాలా ఫీలయ్యారు అని ప్రభాకర్ తెలిపారు.

కొందరు ఫ్యాన్స్ తిట్టారు

కొందరు ఫ్యాన్స్ తిట్టారు

ఎవరూ గుర్తు పట్టకుండా వెళ్లి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉందో చూశాను. నేను బాలయ్యను కొట్టే సీన్ వచ్చినపుడు అభిమానులు ఎవడ్రా వీడూ అంటూ నన్ను తిట్టుకోవడం చూశాను. వాళ్లు తిడుతున్నారంటే ఆ సీన్లో ఎమోషన్స్ వారికి టచ్ అయిందని, సీన్ బాగా పండినట్లే అని అర్థం చేసుకోవాలి అని ప్రభాకర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X