ప్రభాస్‌కు ముఖం చాటేసిన కరణ్.. బాలీవుడ్ ఎంట్రీ లేనట్టే.. కారణం అదే..

By Rajababu

బాహుబలి సిరీస్ చిత్రాలతో ఒక్కసారిగా ప్రభాస్ జాతీయ స్థాయి హీరో అయ్యాడు. భాష, ప్రాంతం అనే భేదం లేకుండా ప్రభాస్‌ను ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేశారు. బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే వాటి గురించి ప్రభాస్ ఆచీతూచీ అడుగు వేశాడు.

Recommended Video

సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ కాపీనా? ఫొటోలు వైరల్‌..

కానీ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు కరణ్ జోహార్‌తో ప్రభాస్ సినిమా చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేయడానికి కరణ్ నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. తాజాగా ప్రభాస్‌ను ఉద్దేశించి కరణ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

 బాహుబలికి మంచి హైప్

బాహుబలికి మంచి హైప్

బాహుబలి చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకమైన తన బ్యానర్‌ ధర్మ ప్రొడక్షన్‌పై హిందీలో ప్రమోట్ చేశారు. ఆ చిత్రానికి భారీ హైప్ వచ్చే విధంగా మార్కెట్ స్ట్రాటెజీని కల్పించడంలో కరణ్ జోహర్ సఫలమయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రభాస్ భారీగా రెమ్యునరేషన్

ప్రభాస్ భారీగా రెమ్యునరేషన్

బాహుబలి తర్వాత తన స్టామినాను తెలుసుకొన్న ప్రభాస్ రెమ్యునరేషన్‌ను భారీగానే డిమాండ్ చేయడంతో కరణ్ జోహర్ వెనుకకు తగ్గినట్టు సమాచారం. ఆ కారణంగానే యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది.

20 కోట్లు డిమాండ్

20 కోట్లు డిమాండ్

బాలీవుడ్ ఎంట్రీ చిత్రంగా రూపొందించే సినిమా గురించి ప్రభాస్‌తో కరణ్ జోహర్ సంప్రదింపులు జరిపారట. ఆ సమయంలో సుమారు 20 కోట్ల రూపాయలను కరణ్ జోహర్ డిమాండ్ చేయడంతో ఆయన కంగుతిన్నాడట.

 స్టామినాకు మించి ప్రభాస్..

స్టామినాకు మించి ప్రభాస్..

ప్రభాస్ తన స్టామినాకు మంచి రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారు. తనకు నచ్చిన పారితోషికాన్ని డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదు. కానీ ఆ మొత్తం బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఇవ్వడం చాలా కష్టమైన పని అని కరణ్ తన సన్నిహితులతో అన్నట్టుగా ఓ వార్త జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

 రజనీకాంత్‌కే మార్కెట్ లేదు..

రజనీకాంత్‌కే మార్కెట్ లేదు..

హిందీ సినిమాను కమర్షియల్‌గా ప్రభావితం చేసేంతగా మార్కెట్ రజనీకాంత్‌తోపాటు ఏ దక్షిణాది హీరోకు లేదు. అలాంటిది ప్రభాస్ తన రెమ్యునరేషన్‌ను చాలా ఎక్కువగా ఊహించుకొన్నాడు. ప్రభాస్‌తో సినిమా తీసే ఆలోచనను మానుకొన్నాను అనే అభిప్రాయాన్ని కరణ్ వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.

 కరణ్ ట్వీట్ వివాదాస్పదం

కరణ్ ట్వీట్ వివాదాస్పదం

ఇలాంటి పరిస్థితుల మధ్య దర్శకుడు కరణ్ జోహర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. కరణ్ చేసిన ట్వీట్ ప్రభాస్‌ను ఉద్దేశించి చేసిందే అనే మాట వినిపిస్తున్నది. కరణ్ తన ట్వీట్‌లో ఏమన్నారంటే.. ‘ ఒకవేళ నీ శక్తి సామర్థ్యాలతో గొప్ప స్థాయికి చేరుకోవాలనే తపన నీకు ఉంటే.. కొన్నింటికి రాజీ పడాలి' అని సూచించాడు.

 సాహోలో నటీనటుల వీరే

సాహోలో నటీనటుల వీరే

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో ఇంకా జాకీ ష్రాఫ్, చంకీ పాండే, మందిరా బేడీ, టిన్ను ఆనంద్, అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X