వినాయక్ మొహమాటపడ్డారు.. ఒక్క మెసేజ్! ఎక్కడికైనా వస్తా: ప్రభాస్

Recommended Video

వినాయక్ మొహమాటపడ్డారు.. ఒక్క మెసేజ్! ఎక్కడికైనా వస్తా: ప్రభాస్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఇంటిలిజెంట్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ఇక ప్రమోషన్స్‌పై ఫోకస్ చేసింది. ఫిబ్రవరి 9న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో.. ప్రమోషనల్ యాక్టివిటీస్ లో వేగం పెంచింది. ఇందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ పాటను విడుదల చేయించడం విశేషం.

 'యోగి'తో అలా ఫీలయ్యా: ప్రభాస్

'యోగి'తో అలా ఫీలయ్యా: ప్రభాస్

'వినాయక్‌'తో యోగి సినిమా చేశా. నా జీవితంలో ఏ సినిమాకీ అంత ఆనందంగా పనిచేయలేదు. అందుకే వినాయక్‌ అంటే నాకు చాలా ఇష్టం.

 ఎక్కడికైనా వస్తా..:

ఎక్కడికైనా వస్తా..:

'ఇంటిలిజెంట్' సినిమా పాట విడుదల చేయాలి... వస్తావా? అని వినాయక్ మొహమాటపడుతూ అడిగారు. ఆయన ఫోన్‌లో చిన్న మెసేజ్‌ ఇస్తే చాలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఆయనపై అభిమానం అలాంటిది.

ఆత్రుతగా ఉంది:

ఆత్రుతగా ఉంది:

చిరంజీవిగారి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన 'చమకు చమకు ఛాం' సాంగ్ ను ఈ సినిమా కోసం రీమేక్ చేశారు. అప్పటి పాటలో చిరంజీవి అదిరిపోయే స్టెప్పులేశారు. మరి సాయిధరమ్‌ తేజ్‌ ఎలా వేశాడో చూడాలని ఆత్రుతగా ఉంది.

ప్రాణమిచ్చే వ్యక్తి..: వివి వినాయక్

ప్రాణమిచ్చే వ్యక్తి..: వివి వినాయక్

స్నేహానికి ప్రాణం ఇస్తాడు ప్రభాస్‌. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతాడు. ఆ ఆనందాన్ని ఈరోజు మా అందరికీ పంచాడు. టీజర్‌ చూసిన వాళ్లంతా తేజు చిరంజీవిలా ఉన్నాడని చెబుతుంటే ఆనందంగా ఉంది.

ప్రభాస్ మా కుటుంబ సభ్యుడు: సాయిధరమ్ తేజ్

ప్రభాస్ మా కుటుంబ సభ్యుడు: సాయిధరమ్ తేజ్

ప్రభాస్‌ని మా కుటుంబ సభ్యుడిలా భావిస్తాం. తన చేతులమీదుగా ఈ పాట విడుదలకావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని నాలుగు పాటలను నాలుగు దఫాలుగా విడుదల చేయబోతున్నాం. ఫిబ్రవరి 9న విడుదలవబోయే ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని భావిస్తున్నాను.

'లెట్స్ డూ':

ఇంటిలిజెంట్ లోని 'లెట్స్ డూ' పాటను ప్రభాస్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాకు థమన్ సంగీతం అందించారు. రచయిత ఆకుల శివ కథ అందించారు. నిర్మాత సి.కల్యాణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X