»   » బాహుబలి: ప్రభాస్‌, తమన్నా సాంగ్ ఖర్చు రూ. 2.5 కోట్లు?

బాహుబలి: ప్రభాస్‌, తమన్నా సాంగ్ ఖర్చు రూ. 2.5 కోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Baahubali: Prabhas, Tamanna song sequence costs Rs 2.5 cr
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం కోసం భారీగా ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. ప్రభాస్, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగుకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరిస్తున్న ఈ ఒక్క పాట చిత్రీకరణకే ఏకంగా రూ. 2.5 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతో విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్.

మరో వైపు 'బాహుబలి' చిత్రం అటు బడ్జెట్ పరంగా...ఇటు బిజినెస్ పరంగా అసలు అంచనాలకు అందడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఖర్చు పెట్టి తీస్తున్న ఈచిత్రం....థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ సంచలనాలు రేకెత్తిస్తున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ చిత్రానికి సంబంధించిన సైడెడ్ రైట్స్ రూ. 13 కోట్లకు, బెంగుళూరు రైట్స్ రూ. 9 కోట్లకు అమ్మడు పోయినట్లు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నైజాం ఏరియా రైట్స్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రూ. 25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి పార్ట్-1 కోసమే దిల్ రాజు ఈ మొత్తం ఖర్చు పెట్టాడట.

English summary

 Tamanna has joined the Bahubali shooting. According to the latest news, a romantic song is currently being shot on Tamanna and Prabhas in Ramoji film city. Now, a buzz making the rounds suggest that Rs 2.5 crores is the expenditure for shooting this duet song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu