For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు కాదన్నా.... రజనీకాంత్ వారసుడు ప్రభాసే!

    By Bojja Kumar
    |
    రజనీకాంత్ వారసుడు ప్రభాసే !

    ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్, దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన సినీ అభిమాని అయినా ఇట్టే గుర్తు పట్టగలిగే స్టార్ ఎవరు అంటే.... అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటు సౌత్‌ సినిమా ఇండస్ట్రీతో పాటు అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. మరి రజనీకాంత్ తర్వాత సౌత్ నుండి ఆస్థాయిలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన స్టార్ ఎవరు? అంటే బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తోంది.

    ప్రభాస్ జీవితాన్ని మార్చేసిన బాహుబలి

    ప్రభాస్ జీవితాన్ని మార్చేసిన బాహుబలి

    ‘బాహుబలి' సినిమా ఒప్పుకునే ముందు ప్రభాస్ కూడా అసలు ఊహించి ఉండడు తనకు దేశ వ్యాప్తంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుందని, నేషనల్ స్థాయి హీరోను అవుతానని, ఇంటర్నేషనల్ లెవల్‌కి ఈ సినిమా వెలుతుందని. ఒక రకంగా చెప్పాలంటే...... బాహుబలి ప్రాజెక్ట్ ప్రభాస్ సినీ జీవితాన్ని మార్చేసింది.

    వేయి కోట్లు దాటడంతో అంతా ఆశ్చర్యం

    వేయి కోట్లు దాటడంతో అంతా ఆశ్చర్యం

    ఈ ఏడాది ప్రభాస్ నటించిన ‘బాహుబలి-ది కంక్లూజన్' మూవీ విడుదలైన తొలిరోజే రూ. 121 కోట్లు వసూలు చేయడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్లకు, సూపర్ స్టార్లకు సాధ్యం కానిది ప్రభాస్ సాధించాడు. దీంతో పాటు ఈ చిత్రం రూ. 1000 కోట్ల కలెక్షన్ దాటిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. ఓవరాల్ గా రూ. 1700 కోట్లు వసూలు చేసింది.

     దేశ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్

    దేశ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్

    బాహుబలి ప్రాజెక్టుతో ప్రభాస్‌ దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడికి పెళ్లి కాలేదని తెలిసి వేలాది మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పంపారంటే.... అతడికి ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

     రజనీ తర్వాత ఆ స్థాయిలో చొచ్చుకెళ్లిన స్టార్ ప్రభాస్

    రజనీ తర్వాత ఆ స్థాయిలో చొచ్చుకెళ్లిన స్టార్ ప్రభాస్

    ఇండియాలో సౌత్ సినిమా, నార్త్ సినిమా పరిశ్రమలు భిన్నంగా ఉంటాయి. సౌత్ సినిమాలకు నార్త్‌లో పెద్దగా ఆదరణ లభించదు, బాలీవడ్లో ఎంత పెద్ద స్టార్ అయినా సౌత్‌లో ఆ సినిమాలు పెద్దగా ఆడవు. ఇండియాలో ఇప్పటి వరకు ఈ గీతను చెరిపేసి ఎక్కడైనా తన సినిమా ఆడేలా ఫాలోయింగ్, ఫ్యాన్ క్రేజ్ సంపాదించుకున్న స్టార్ రజనీకాంత్ మాత్రమే. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా అభిమానుల మనసుల్లోకి చొచ్చుకెళ్లిన స్టార్ ప్రభాస్ మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

     ట్రేడ్ ఎ‌క్స్‌పర్ట్ అముల్ మోహన్ ఏమంటున్నారంటే

    ట్రేడ్ ఎ‌క్స్‌పర్ట్ అముల్ మోహన్ ఏమంటున్నారంటే

    ఇండియన్ సినిమా ట్రేడ్ ఎక్స్ పర్ట్ అముల్ మోహన్ మాట్లాడుతూ... సౌత్ స్టార్ల సినిమాలు తమ సొంత రాష్ట్రం దాటి బయటకు వచ్చి ఆడటం చాలా కష్టం. ఈ విషయంలో కొన్ని దశాబ్దాలుగా సక్సెస్ అవుతూ వస్తున్న స్టార్ రజనీకాంత్ ఒక్కరే. 2017 సంవత్సరంలో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది.... భవిష్యత్తులో ఇండియన్ సినిమా పరిశ్రమలో రజనీకాంత్ స్థానం ఆక్రమించేది ప్రభాస్ మాత్రమే' అని తెలిపారు.

     సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

    సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్

    బాహుబలి తర్వాత ప్రభాస్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రభాస్ నెక్ట్స్ మూవీ ‘సాహె' ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

     ఆ విషయంలోనూ రజనీకాంత్‌ను గుర్తు చేస్తున్నాడు

    ఆ విషయంలోనూ రజనీకాంత్‌ను గుర్తు చేస్తున్నాడు

    ప్రభాస్ తన చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ చాలా క్లోజ్‌గా ఉంటారు. రజనీకాంత్ కూడా తన స్నేహితులకు ఎంత వ్యాల్యూ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయంలో ఇద్దరూ ఒకే విధంగా అనిపిస్తారంటూ పోల్చి చూస్తున్నారు అభిమానులు.

     ప్రభాస్ నిలబెట్టుకుంటాడా?

    ప్రభాస్ నిలబెట్టుకుంటాడా?

    అయితే బాహుబలి ప్రాజెక్టు ద్వారా వచ్చిన స్టార్ ఇమేజ్, ఫాలోయింగ్ ప్రభాస్ నిలబెట్టుకుంటూ.... జాతీయ స్థాయిలో మరికొన్ని హిట్స్ కొడితే భవిష్యత్తులో రజనీకాంత్ వారసుడు ప్రభాస్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఈ నమ్మకాన్ని ప్రభాస్ ఏమేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

    English summary
    The fan frenzy and mass hysteria garnered by Prabhas is a phenomenon, which was earlier witnessed only for Rajinikanth fans. The tremendous fan following and box office appeal of Prabhas is something which is incredible. We can easily proclaim him as a young successor to Superstar Rajinikanth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X