పద్మావతి వివాదంలోకి ప్రభాస్.. బాహుబలికి కులం ట్యాగ్.. రంగంలోకి కృష్ణంరాజు
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ చిత్రంప శ్రీ రాజ్‌పుత్ కర్నిసేన లాంటి హిందుత్వ సంస్థలు సినిమాపై మండిపడుతున్నాయి. రిలీజ్‌ను అడ్డుకొంటున్నాయి.
Recommended Video

గత ఏడాది కాలంగా పద్మావతి చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందు నిరసనలు, వ్యతిరేక ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ చిత్రంప శ్రీ రాజ్‌పుత్ కర్నిసేన లాంటి హిందుత్వ సంస్థలు సినిమాపై మండిపడుతున్నాయి. రిలీజ్‌ను అడ్డుకొంటున్నాయి. ఒకవైపు ఇలా వివాదాలు కొనసాగుతుంటే మరో వైపు ప్రభాస్‌ను ఈ వివాదంలోకి లాగడం కొత్త మలుపు తిరిగింది.

వివాదాల సుడిలో పద్మావతి
పద్మావతి చిత్రంలో నటించిన దీపికా పదుకొన్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కొన్ని సంస్థలు బహిరంగ ప్రకటన చేశాయి. దీపికా పదుకొన్ ముక్కులు కోసిన 5 కోట్ల బహుమానం అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా భన్సాలీ తల తెగ నరికిన వారికి రూ.10 కోట్ల రూపాయలు బహుమానంగా ఇస్తామన్నారు.

పలు రాష్ట్రాలను కుదిపేస్తున్న పద్మావతి
పద్మావతి వివాదం రాజస్థాన్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావతికి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా, బీజేపేతర రాష్ట్రాల్లో పద్మావతికి అనుకూలంగా మద్దతు తెలుపుతున్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు.

వివాదంలోకి ప్రభాస్ రాజు
పద్మావతిపై వివాదాలు ఇలా కొనసాగుతుంటే బాహుబలితో జాతీయవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్‌ను ఇందులోకి లాగేందుకు ఆల్ క్షత్రియ మహాసభ అనే సంస్థ ప్రయత్నించింది. పద్మావతి వివాదంపై ప్రభాస్ మాట్లాడాలని, ఓ సామాజిక వర్గం మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని ఖండించాలని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటన చేశారు.

మీడియాలో ప్రభాస్ వ్యవహారం
పద్మావతి వివాదంలోకి ప్రభాస్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉత్తరాది టెలివిజన్ ఛానెళ్లు ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేశాయి. పద్మావతి చిత్రంపై ప్రభాస్ మాట్లాడాలి అని ఓ వర్గం డిమాండ్ చేసే వరకు వెళ్లింది. దాంతో ప్రభాస్ వ్యవహారం చాలా వైరల్ అయింది.

బాహుబలి ప్రభాస్ మా వాడే..
ప్రభాస్‌ను ఎందుకు మాట్లాడాలని ఆల్ క్షత్రియ మహాసభ ప్రతినిధులు పట్టుపట్టారంటే.. ఆయన కూడా క్షత్రియ వంశానికి చెందిన వాడు కావడమే. ఈ వివాదాన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా ప్రభాస్‌ను క్షత్రియులు తన వాడనే ఫీలింగ్‌తో ఉన్నట్టు స్పష్టమవుతున్నది.

రంగంలోకి దూకిన కృష్ణంరాజు
పద్మావతి వ్యవహారంలోకి ప్రభాస్‌ను లాగడంతో పెదన్నాన కృష్ణంరాజు అప్రమత్తమయ్యారట. వెంటనే పద్మావతిపై ఎలాంటి ప్రకటన గానీ, ఏ విధమైన స్పందనగానీ చూపించవద్దుని ప్రభాస్‌కు సూచించాడట. ప్రభాస్ ఏం మాట్లాడినా అతనికి నష్టం కలిగించే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కృష్ణంరాజు తగిన జాగ్రత్తలు తీసుకొన్నాడట. ప్రభాస్ కెరీర్‌కు ఎలాంటి ముప్పు కలుగకుండా నష్ట నివారణ చర్యలు తీసుకొన్నాడట.


Click it and Unblock the Notifications











