»   » బాహుబలి: హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్

బాహుబలి: హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘బాహుబలి' మూవీ భారతీయ సినీ చరిత్రలోనే భారీ మూవీ కాబోతోంది. తాజాగా బాహుబతి సినిమాకు సంబంధించి ఓ హాలీవుడ్ స్టూడియోతో రూ. 500 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రముఖ హాలీవుడ్ సినీ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోతో రూ. 500 డీల్ కుదిరినట్లు సమాచారం.

‘బాహుబలి' చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న ‘ధర్మా ప్రొడక్షన్స్' అధినేత కరణ్ జోహార్ ఈ డీల్ వెనక కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘బాహుబలి' సినిమా ద్వారా నిర్మాతలకు కాసుల పంట ఖాయంగా కనిపిస్తోంది. ఎంతైనా రాజమౌళి టాలెంటే టాలెంటు. సినిమాలను భారీగా తీయడంలోనూ...నిర్మాతలకు లాభాలు వచ్చేలా మార్కెటింగ్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.


సినిమా గురించి మాట్లాడుకుంటే...ఇటీవల విడుదలై ‘బాహుబలి' ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోయింది. పలువురు హాలీవుడ్ రివ్యూ రైట్లు కూడా ఈ చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందని ప్రశంసించారు. పరిస్థితి చూస్తుంటే ‘బాహుబలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కాబోతోందని స్పష్టమవుతోంది.


Baahubali Producer's 500 Crore Deal Fox Star Studios

‘బాహుబలి' ఆడియో మే 31న హైటెక్స్‌లో జరుగాల్సి ఉండగా.... భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆడియో వేడుక వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త డిసప్పాయింటుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బాహుబలి దర్శక నిర్మాతలు డిఫరెంటుగా థింక్ చేసారు.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' ఆడియో వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడయితే అనుమతుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు. స్థలం కూడా కావాల్సినంత ఉంటుంది కాబట్టి ఎంత మంది అభిమానులు వచ్చినా సమస్య ఉండదని అంటున్నారు. జులై 10న ఆడియో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.


రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రంగా నిలిపోనుంది. అంతర్జాతీయ స్టాండర్ట్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10 సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

English summary
Baahubali Producer's 500 Crore Deal With Fox Star Studios. This 500 crore deal is by far the biggest ever film co-production deal by an Indian production house with a Hollywood studio.
Please Wait while comments are loading...