twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR అనుకున్న టైంకి వస్తుందా .. బాహుబలి నిర్మాత ఏం చెప్పాడంటే!

    |

    గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. ఆ సమయంలో వీరిద్దరి ఎలా ఉండేవారు అనే అంశంతో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించబోతున్నారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి స్పందించారు.

    ఇప్పుడు అర్థం అవుతోంది

    శోభు యార్లగడ్డ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ట్విట్టర్ లో స్పందించారు. ఈ చిత్రాన్ని 2020 జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు డివివి దానయ్య మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ గురించి శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. ఎదురుచూడలేకున్నా. బాహుబలి చిత్రం విషయంలో అభిమానులు ఎంతగా ఎదురుచూశారో ఇప్పుడు అర్థం అవుతోంది అని శోభు అన్నారు.

     ఒక అభిమానిగా

    ఒక అభిమానిగా

    ఆర్ఆర్ఆర్ చిత్ర టీజర్, ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు. ఒక అభిమానిగా ఈ ప్రశ్న అడగడం చాలా బావుంది అని శోబు ట్వీట్ చేశారు. సమీప భవిష్యత్తులో ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్, టీజర్ ఉండదని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టడం సరైనది కాదు అని రాజమౌళి అభిప్రాయపడ్డారు.

    RRR: తారక్, చరణ్ ఫ్యాన్స్ హర్టవుతారని ఆలోచిస్తే కథలో రసం ఉండదన్న రాజమౌళిRRR: తారక్, చరణ్ ఫ్యాన్స్ హర్టవుతారని ఆలోచిస్తే కథలో రసం ఉండదన్న రాజమౌళి

    అనుకున్న టైంకి

    ఓ అభిమాని ట్విట్టర్‌ లో శోభు యార్లగడ్డని ప్రశ్నించారు. ఓ నిర్మాతగా చెప్పండి.. ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్న సమయానికే వస్తుందా అని ప్రశ్నించగా.. శోభు బాహుబలి 2 చిత్రాన్ని ప్రస్తావిస్తూ సమాధానం ఇచ్చారు. నాకు చాలా నమ్మకం ఉంది ఆర్ఆర్ఆర్ చిత్రం 2020 జులై 30న వస్తుంది. మా బాహుబలి2 కూడా ముందుగా ప్రకటించిన తేదీనే విడుదలైందని శోభు అన్నారు.

    బాహుబలి తర్వాత

    బాహుబలి తర్వాత

    బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్, కొమరం భీమ్ పాత్రలో జూ.ఎన్టీఆర్ నటిస్తున్నారు. అలియా భట్ సీత పాత్రలో రాంచరణ్‌కు జోడిగా నటించనుంది. ఎన్టీఆర్ కి జోడిగా రాజమౌళి విదేశీ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేశారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు.

    English summary
    Baahubali producer Shobu Yarlagadda interesting comments on RRR movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X