‘బాహుబలి’ షూటింగ్ ఆగి పోయింది...టోటల్ టీం బ్రేక్!
హైదరాబాద్: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ సినిమాలో ఎంతో కీలకమైన యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
తాజాగా చిత్రం షూటింగ్ నిలిపి వేసారు. ఇంతకాలం విరామం లేకుండా, అలుపు ఎరుగకుండా పని చేసిన టీం మొత్తం.......కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ బ్రేక్ ఇచ్చారు. ఈ విషయాన్ని బాహుబలి అఫీషియల్ వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగును రివ్యూ చేసుకోవడానికి, నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి ఈ బ్రేక్ బాగా ఉపయోగ పడుతుందని అంటున్నారు.

అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ బ్రేక్‌లోనూ పని చేస్తున్నారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుతో కలిసి ఎడిటింగును పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్, పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ప్రస్తుతం రెండు సాంగులను రీ రికార్డింగ్ చేస్తున్నారు. తర్వాతి షెడ్యూల్‌లో హీరోయిన్ తమన్నా షూటింగులో జాయిన్ కాబోతోంది.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











