»   »  షాక్: ఇంజనీరింగ్ ఎగ్జామ్‌లో రాజమౌళి ‘బాహుబలి’

షాక్: ఇంజనీరింగ్ ఎగ్జామ్‌లో రాజమౌళి ‘బాహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఓ సంచలనం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం బాషల్లో విడుదలైన ఈచిత్రం రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. రాజమౌళి అండ్ టీం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడి, భారీ సెట్టింగుల వేసి, గ్రాఫిక్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

బాహుబలి సినిమా చూసిన వారంతా.... ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదని మెచ్చుకున్నారు. సినిమా విడుదల ముందు, విడుదలైన తర్వాత కొన్ని రోజుల పాటు బాహుబలి మేనియా కొనసాగిందంటే ఆ సినిమా ప్రభావం జనాలపై ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Baahubali questions in engineering exam

ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎగ్జామ్ లో బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. 90 నిమిషాల్లో జవాబులు రాయాలని ఇచ్చిన 50 మార్కుల ప్రశ్నా పత్రంలో 40 మార్కుల ప్రశ్నలు బాహుబలిపైనే ఉన్నాయట.


ఓ ఫైటింగ్ సీన్ లో ప్రభాస్, రానాలకు దెబ్బలు తగలకుండా తీసుకున్న జాగ్రత్తలేవి?, బాహుబలి సెట్ కు నువ్వే ఆ సెట్ కు ఇన్ చార్జ్ గా ఉంటే తీసుకునే జాగ్రత్తలేవి? అనే ప్రశ్నలు అందులో వచ్చాయట. భవన నిర్మాణాలకు వాడాల్సిన ప్రమాణాలు బాహుబలి సినిమాలో కనిపించాయని కూడా ఉపోద్ఘాతంలో ఉందట. తమిళనాడులోని ఓ ప్రముఖ కాలేజీలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

English summary
Baahubali questions in engineering exam.
Please Wait while comments are loading...