బహుబలి : కత్తియుద్ధం ట్రైనర్ ఇతడే...!
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో 'బహుబలి' అనే భారీ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాణా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ఈచిత్రంలో ఇప్పటికే కత్తియుద్ధం, మార్షల్ ఆర్ట్స్ తదితర విభాగాల్లో శిక్షణ ప్రారంభించారు.
తమకు ట్రైనింగ్ ఇస్తున్న వియత్నాంకు చెందిన ట్రైనర్ ఫోటోను రాణా తన ట్విట్టర్లో పోస్టు చేసాడు. అతని పేరు Tuan. ఇతడు కత్తి యుద్దం, మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యల్లో ఆరితేరిన ట్రైనర్. పలు హాలీవుడ్ సినిమాలకు కూడా పని చేసాడు. మరి ప్రభాస్, రాణాలను కత్తియుద్ధంలో ఏ రేంజిలో తీర్చి దిద్దుతాడో చూడాలి.
కాగా..ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది. ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











