»   » 'బాహుబలి' కు అక్కడా ఓ రేంజిలో ఫాలోవర్స్‌

'బాహుబలి' కు అక్కడా ఓ రేంజిలో ఫాలోవర్స్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మొత్తం 50 వేల మంది ఫాలోవర్స్‌ చేరారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. దీనికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

We have reached 50,000 followers on Instagram! It’s your love and support that motivates and inspires us – thank you all! For all those who haven't yet, please do follow us for regular Baahubali updates!


Posted by Baahubali on 2 November 2015

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


 Baahubali reached 50,000 followers on Instagram

తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

English summary
Baahubali team tweeted: We have reached 50,000 followers on Instagram! It’s your love and support that motivates and inspires us – thank you all! For all those who haven't yet, please do follow us for regular Baahubali updates!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu