twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ మరో 100 కోట్లు వసూలు చేస్తుందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి తోసింది. 50 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఈ చిత్రం కొన్ని చోట్ల ఇంకా ప్రదర్శితం అవుతోంది.

    తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ‘బాహుబలి' మరో 100 కోట్లు రాబడుతుందని భావిస్తున్నారు. చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించినట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేయించారు.

    ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగిన విధంగా ఎడిట్ చేసారు.'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', 'టేకెన్ 2', 'నౌ యూ సీ మీ', 'ద లెజెండ్ ఆఫ్ హెర్క్యులస్' వంటి పలు చిత్రాలకు విన్సెంట్ ఎడిటర్ గా పనిచేశారు.

    Baahubali Ready To Collect Another 100 Crores

    ‘బాహుబలి-ది బిగినింగ్' త్వరలో కెనడాలో జరుగబోయే టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లబోతోంది. ఇక్కడ సినిమాను ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా కలిసొస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

    త్వరలో బాహుబలి పార్ట్ -2 కూడా రాబోతోంది. 'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    English summary
    Baahubali is continuing its dream run even after completing 50 days of release, in times when long run is a nightmare. While the film has already garnered 600 plus crores in Indian languages, it is gearing up to add 100 more crores to its historic collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X