twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' షోలపై ప్రభుత్వం దృష్టి...ప్రత్యేక ఏర్పాట్లు

    By Srikanya
    |

    ఖమ్మం : మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి' ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం దాదాపుగా రూ.68 కోట్ల షేర్‌ వసూలు చేసి ట్రేడ్‌ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది భారతీయ చిత్రపరిశ్రమ రికార్డుగా ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం సైతం ఈ చిత్రం షోలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    'బాహుబలి' సినిమా వసూళ్ల వివరాలను లెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను నియమించింది. ప్రభుత్వానికి వినోదపు పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో ఖమ్మం నగరంలో మొత్తం ఆరు థియేటర్లలో సినిమాను ప్రదర్శించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఒక్కో థియేటర్‌కు ఒక డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ను నియమించారు. ప్రతి షోను వీరు పరిశీలించాల్సి ఉంటుంది. నలుగురు అధికారులకు మూడు రోజుల పాటు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నగరంలో సహజంగా వాణిజ్య పన్నుల శాఖలో ఒక వినోదపు పన్ను అధికారి ప్రత్యేకంగా ఉంటారు.

    Baahubali revenue goes to Government

    'బాహుబలి' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించటంలో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయన్న ఉద్దేశంతో ప్రత్యేకాధికారులను నియమించారు. టిక్కెట్లు సరిగా విక్రయిస్తున్నారా? అదనపు సీట్లు ఏమైనా ఉన్నాయా? అనేది వీరు పర్యవేక్షిస్తున్నారు.

    కలెక్షన్లపై 15 శాతం వినోదపు పన్ను చెల్లించాల్సి ఉంది. మొత్తం ఆరు థియేటర్ల ద్వారా గణనీయ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కో సినిమా హాలులో సగటున 600 నుంచి 800 వరకు సీట్లు ఉన్నాయి. రూ.10, రూ.50, రూ.70 ధరల్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు.

    'బాహుబలి' చిత్ర ప్రదర్శనతో రోజుకు సగటున ఒక్కో థియేటర్‌ నుంచి రూ.20 వేల చొప్పున వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో శ్లాబ్‌ పద్ధతి లేదు. దీంతో అక్కడి థియేటర్ల నుంచి పన్ను వసూళ్లు ఉండవు. ఇదిలా ఉండగా డీసీటీవోలు రోజుకో థియేటర్‌లో జంబ్లింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు.

    మరో ప్రక్క

    ‘బాహుబలి' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తా చాటుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా సత్తా చాటింది.

    Baahubali revenue goes to Government

    ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' పికె రికార్డును బద్దలు కొట్టింది.

    ‘బాహుబలి' సినిమా అమెరికా బాక్సాపీసు వద్ద తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే మున్ముందు ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    At least daily 20,000 of baahubali theatre revenue will have to be paid to the State Government in the form of entertainment tax.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X