Just In
- 4 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 37 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 56 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Automobiles
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఐ’ ఎఫెక్ట్: బాహుబలి, రుద్రమదేవిలపై తగ్గింపు?
హైదరాబాద్: గత నెలలో వచ్చిన రజనీకాంత్ ‘లింగా' చిత్రంపై ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలం అయింది. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో బాక్సాఫీసు వద్ద నష్టాలను చవి చూసింది. తాజాగా శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' చిత్రం సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోలేక పోయింది. తొలి రోజే సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చింది.

ఈ నేపథ్యంలో.......త్వరలో తెలుగు రాబోతున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాలపై అంచనాలను వీలైనంతగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నరు ప్రేక్షకులు. ఎలాంటి అంచనాలు, ఊహలు లేకుండా సినిమాకు వెళితేనే బావుంటుందని సినిమా ప్రియులు భావిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రుద్రమదేవి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ‘బాహుబలి' చిత్రం కూడా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలపై అంచనాలు తగ్గించుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

రుద్రమదేవి గురించి...
అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగినీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నిరువధ్యపురం యువరాజు.. చాళుక్య వీరభధ్రుడుగా రానా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సినిమా గురించి దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ..‘భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న మా రుద్రమదేవి చిత్రానికి సంబంధించి ప్రస్తుతం శరవేగంగా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో కనిపిస్తుండటం మరో ప్రత్యేకత.

బాహుబలి గురించి...
ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. 2015 వేసవిలో తొలి భాగం వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.
ప్రభాస్, అనుష్క, దగ్గుబాటి రానా, తమన్నా, రమ్యక్రిష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్, కథ: వి.విజయేంద్రప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: ఎం.రత్నం, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.