»   » ‘బాహుబలి’ బెనిఫిట్.... ఏపీ రాజధాని కోసమే!

‘బాహుబలి’ బెనిఫిట్.... ఏపీ రాజధాని కోసమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ‘బాహుబలి' సినిమా ప్రదర్శన ద్వారా సహాయం చేయబోతున్నారట. ‘ఈగ' చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వారాహి సంస్థలో ‘బాహుబలి' చిత్ర కృష్ణాజిల్లా హక్కులను దక్కించుకున్నారు. ఈనెల 10న సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఒకరోజు ముందే జూలై 9న విజయవాడతో సహా పలు ప్రదేశాల్లో ప్రీమియర్ షో వేసి తద్వారా వచ్చే మొత్తాన్ని ఏపీ రాజధాని అమరావతికి ఫండ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.


Baahubali's contribution for AP capital

బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు కలెక్షన్లు సాధించడం ఖాయం అంటున్నారు. ఓవరాల్ గా బాహుబలి మూవీ బిజినెస్ 300 కోట్లు దాటుతుందని అంచనా.

English summary
The team of Baahubali should be feeling proud for many reasons now. It is not just because they made the Tollywood's biggest film till date but for other socially responsible reasons as well. The film's grand release has been scheduled on July 10 and the film's unit is coming up with interesting promotional strategies as the D-Day is approaching!
Please Wait while comments are loading...