‘బాహుబలి’ విజువల్ ఎఫెక్ట్ వెనక సీక్రెట్ ఇదే.. (వీడియో)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ విజువల్ వండర్. సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకులను కళ్లు చెదిరే గ్రాఫిక్స్ మంత్రముగ్దుల్ని చేసాయి. మాయా నగరం మాహిష్మతి, అబ్బురపరిచే జలపాతాలు, ఉత్కంఠ రేపే యుద్ద సన్నివేశాలు, భయం గొలిపే కాలకేయ సైన్యం.

హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇండియన్ సెల్యులాయిడ్ పై రాజమౌళి అండ్ టీం ఒక అద్భుతమే సృష్టించారు. బాహుబలి సినిమా విజువల్ ఎఫెక్టు వెనక ఉన్న రహస్యాలను బయట పెడుతూ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ అందించిన మకుట సంస్థ ఓ వీడియో విడుదల చేసింది.
రమ్య కృష్ణ నదిలో కొట్టుకు పోతూ ఓ చేతిలో బిడ్డను పట్టుకుంటుంది. వాస్తవానికి ఆమె చేతిలో ఓ వాటర్ బాటిల్ పట్టుకుంది. తర్వాత దానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి మనకు అద్భుతంగా చూపించారు. అదే విధంగా సినిమాలోని జలపాతాలు, ప్రభాస్ విన్యాసాలు, మాహిష్మతి రాజ్యం ఇవన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్ మాయే. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...


Click it and Unblock the Notifications











