»   » వినండి : 'బాహుబలి' లోని 'శివుని ఆన' పూర్తి సాంగ్

వినండి : 'బాహుబలి' లోని 'శివుని ఆన' పూర్తి సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా పాటల్ని ఈ నెల 13న ,తిరుపతిలో విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో బాహుబలి టీమ్ అఫీషియల్ గా తమ చిత్రంలోని 'శివుని ఆన' పూర్తి సాంగ్ ని విడుదల చేసారు. ఈ పాట ఇప్పుడు సినీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. మీరూ ఈ పాటని వినండి.


చిత్రం ఆడియోను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


 Baahubali's Sivuni Aana Full Audio Song

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Music lovers eagerly waiting for Baahubali Audio Songs, here it is 'Sivuni Aana' Full AUDIO Song from the movie Baahubali. Baahubali Starring Prabhas, Rana Dagubatti, Anushka Shetty and Tamannaah Bhatia in the lead roles. The audio event of 'Baahubali - The Beginning' will be held in Sri Venkateswara University grounds, Tirupati on June 13th. #LiveTheEpic"
Please Wait while comments are loading...