మళ్లీ పట్టాలెక్కిన ‘బాహుబలి’ షూటింగ్
ఈచిత్ంరలో ప్రభాస్ పోరాట యోధుడైన రాజు పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆద్వర్యంలో 'బాహుబలి' చిత్రం కోసం అద్భుతమైన సెట్టింగ్స్ వేసారు. అలనాటి రాచరికానికి దర్పణంలా ఈ సెట్టింగ్స్ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం 'arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












