రానాను కాలుతో తన్ని చెప్పిన ప్రభాస్ (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో బాహుబలి సినిమా టీం సరికొత్త ప్రొమో విడుదల చేసారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు టిప్స్ చెబుతూ ప్రోమో సాగుతుంది. పరీక్షల సమయంలో ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలను ఇందులో పొందు పరిచారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. ఈచిత్రం షూటింగ్ గత కొంత కాలంగా రామెజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే మరో షెడ్యూల్ ప్రారంభానికి ముందు షూటింగుకు కాస్త బ్రేక్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. బ్రేక్ ఇస్తే టీం కాస్త రిలాక్స్ అవుతుంది, తద్వారా నెక్ట్స్ షెడ్యూల్ బాగా తెరకెక్కించవచ్చనేది రాజమౌళి ప్లాన్.

భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.

All the best for the Exams

దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/s84xclPAFgs" frameborder="0" allowfullscreen></iframe></center>


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X