»   » షూటింగ్ బ్రేక్ ..క్రికెట్ ఆటలో బిజీగా ‘బాహుబలి’ టీమ్ (వీడియో)

షూటింగ్ బ్రేక్ ..క్రికెట్ ఆటలో బిజీగా ‘బాహుబలి’ టీమ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్, రానా కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి- ది కన్ క్లూజన్' షూటింగ్ హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కు రాజమౌళి బ్రేక్ ఇచ్చి...క్రికెట్ ఆడటం మొదలెట్టారు.

అదేంటి...షూటింగ్ బ్రేక్ ఇస్తే ఇబ్బంది అవదా..పని మానేసి క్రికెట్ ఆడటం ఏమిటీ అంటారా...ఉంది..దానికీ రీజన్ ఉంది. 'బాహుబలి- ది కన్ క్లూజన్' ను దర్శకుడు రాజమౌళి హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.


Baahubali shoot disrupted by rain

ఈరోజు వాటి చిత్రీకరణకు ఆఖరిరోజు. కానీ అకస్మాత్తుగా హైదరాబాద్ లో ఈరోజు ఉదయం వర్షం కురవడంతో షూటింగ్ స్పాట్ మొత్తం నీటితో నిండిపోయి షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇదిగో ఈ వీడియో లో లాగ క్రికెట్ ఆట మొదలెట్టారన్నమాట.రాజమౌళి ట్వీట్ చేస్తూ.. 'ఈరోజు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ ఆఖరిరోజు. కానీ వర్షం వల్ల షూటింగ్ స్పాట్ తడిచిపోయి చిత్రీకరణ ఆగిపోయింది. యూనిట్ తడిసిన షూటింగ్ స్పాట్ ను క్రికెట్ ఆడుకోవడానికి వాడుకుంటున్నారు' అంటూ ట్వీట్ వేసి వాళ్ళు క్రికెట్ ఆడే వీడియోను కూడా దానికి యాడ్ చేశారు. ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదండీ విషయం.

రాజమౌళి ట్వీట్ చేస్తూ.. 'ఈరోజు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ ఆఖరిరోజు. కానీ వర్షం వల్ల షూటింగ్ స్పాట్ తడిచిపోయి చిత్రీకరణ ఆగిపోయింది. యూనిట్ తడిసిన షూటింగ్ స్పాట్ ను క్రికెట్ ఆడుకోవడానికి వాడుకుంటున్నారు' అంటూ ట్వీట్ వేసి వాళ్ళు క్రికెట్ ఆడే వీడియోను కూడా దానికి యాడ్ చేశారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.English summary
Rain played a spoilsport earlier today as the entire S S Rajamouli’s Baahubali shoot for the day had to be cancelled. The team was spotted playing a fun game of cricket on the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu