'బాహుబలి' షూటింగ్ పేలుడు...నలుగురికి గాయాలు

By Srikanya

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ లో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయింత్రం ఫైటింగ్ సీన్ జరుగుతూండగా పేలుడు సంభవించి,నలుగురుకి మంటలు అంటుకున్నాయి. అయితే భారీ ప్రమాదమేమీ జరగలేదు. చిన్న స్పల్ప గాయాలతో ఫైటర్లు బయిటపడ్డారు.

వివరాల్లోకి వెళితే... హయిత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిలిం సీటిలో 'బాహుబలి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఫైటింగ్ సీన్స్ తీస్తున్నారు. షూటింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున కుంకుమ వెదజల్లేందుకు పేలుడు పదార్దాలను వినియోగించారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి.

దాంతో ఫైటింగ్ సీన్ లో పాల్గొనేందుకు వచ్చి ప్రక్కనే నిలబడ్డ నలుగురు ఫైటర్లకు ఆ మంటలు అతి సమీపంగా ఎగిసిపడ్డాయి. దాంతో ఫైటర్లు సతీష్, పాండు, సంతోష్ లకు స్పల్పంగా గాయాలయ్యాయి. వారు హయత్ నగర్ లోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్ళినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అథికారిక సమాచారం ఏదీ లభ్యం కాలేదు.

 Baahubali Shooting..fire accident

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని తమ ప్రతిభను చూపిస్తున్నారు.

ఏప్రియల్ 2015 లో విడుదల అయ్యే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ తొమ్మిది కోట్లు తొలి భాగం మేరకే అని చెప్తున్నారు. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. వినిపిస్తున్నాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. దాంతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X