twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' వరస్ట్ సినిమా..అవార్డ్ ఎలా ఇస్తారు? డైరక్టర్ సీరియస్

    By Srikanya
    |

    ముంబై: ఓ ప్రక్క.. జాతీయ ఉత్తమ చిత్రంగా 'బాహుబలి' ఎంపికవ్వడం పట్ల సర్వత్రా ప్రశంసలు వినిపిస్తూంటే...అక్కడక్కడా , విమర్శలు సైతం వస్తున్నాయి. ముఖ్యంగా.. పంజాబీ దర్శకుడు గురువిందర్ సింగ్ అవార్డుల ఎంపికపట్ల, బాహుబలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రం ఏమిటంటే ఆయనకు సైతం నేషనల్ అవార్డ్ రావటం.

    గురువిందర్ సింగ్ మాట్లాడుతూ... "అన్ని ప్రధానమైన అవార్డులు ..కమర్షియల్ చిత్రాలకే వెళ్లిపోయాయి. బాహుబలి పూర్తి గా క్రాప్. దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇచ్చారు. ఇది నేషనల్ అవార్డ్ కాదు..బిజిపి అవార్డ్ ," అని ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.

    ఈ అవార్డుల ప్రకటనే ఒక పెద్ద జోక్‌ అని దర్శకుడు విమర్శించాడు. కాగా గురువిందర్ సింగ్ తీసిన 'చౌత్తీకూట్‌' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. మరోవైపు గురువిందర్‌సింగ్‌ చేసిన కామెంట్స్ ను చాలా మంది సమర్థిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావటం గమనార్హం.

    'Baahubali' shouldn't have got best film at National Award: Gurvinder Singh

    'బాహుబలి ఖచ్చితంగా చాలా గొప్ప చిత్రమే. హాలీవుడ్ స్థాయిని మన భారతీయ సినిమాలు అందుకుంటాయని నిరూపించిన మూవీ ఇది. కానీ సన్నివేశాల చిత్రీకరణలో అదేవిధంగా నటీ నటుల ప్రతిభను తెరకెక్కించడంలో ఉద్వేగాలను చిత్రీకరించడంలో 'బాజీరావ్ మస్తానీకే' ఎక్కువ మార్కులు పడ్డాయి' అని వివరణ ఇచ్చాడు కౌషిక్.

    అదే విధంగా 'బాహుబలి' సినిమా విషయంలో జాతీయ అవార్డుల ప్యానల్ అన్యాయం చేసింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో 600 కోట్ల కలక్షన్స్ ను వసూలు చేసిన 'బాహుబలి' సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డును ఇచ్చి సరిపెట్టడమే కాకుండా ఈ సినిమాలో కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే బాగున్నాయి అన్న సంకేతాలు వచ్చే విధంగా ఈసినిమాకు జాతీయ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు ఇచ్చారు.

    'Baahubali' shouldn't have got best film at National Award: Gurvinder Singh

    ముగ్గురు జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ఎంపిక చేశారు. ఈసారి డిజిటల్ రూపంలో ఎంట్రీలు వచ్చాయి. ఫీచర్ కేటగిరీలో 29 భాషల్లో 308 సినిమాలు ఎంట్రీ వచ్చాయి. మొత్తం రెండు నెలల పాటు సెలక్షన్ ప్రక్రియ కొనసాగినట్లు సభ్యులు తెలిపారు. అవార్డులు ప్రకటించిన వాళ్లలో ఫిల్మ్ బోర్డుకు చెందిన గంగమరియన్, సంజీవ్‌దత్తా, జాన్, ధరమ్ గులాటీ, జాన్ సహాయ్, ఎస్‌ఆర్ లీలా, శ్రీకే వాసు, సతీశ్ కౌశిక్ ఉన్నారు.

    English summary
    “All the main awards have gone to commercial films. ‘Baahubali’, which is a totally crap film has got the Best Film award. I think it is a BJP award and not National Award,” Gurvinder Singh. Gurvinder Singh, whose 'Chauthi Koot' won the National award for best Punjabi movie, says 'Baahubali' did not deserve best feature film honour at the awards. "Not only me, everybody is saying the decisions are not correct. 'Baahubali' is perhaps the worst film ever to have got a National award. And that too the best film," Gurvinder told
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X