»   »  బాహుబలి: ఎవ్వడంట ఎవ్వడంట ఫుల్ సాంగ్ (వీడియో)

బాహుబలి: ఎవ్వడంట ఎవ్వడంట ఫుల్ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి- ది బిగినింగ్' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా మాత్రమే కాదు, సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా వీడియో సాంగుల అద్భుతంగా ఉన్నాయి. సినిమా విడుదలై చాలా రోజులైనా ఆ సినిమాలోని పాటలపై జనాల్లో మక్కువ తగ్గలేదు.

తాజాగా బాహుబలి సినిమాలోని ‘ఎవ్వడంట ఎవ్వడంట' సాంగ్ ను నిన్న యూట్యూబులో విడుదల చేయగా... 24 గంటల గటడవక ముందే దాదాపు 50 వేల మంది చూసారు. ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన శివుడి పాత్ర శివ లింగాన్ని ఎత్తే సన్నివేశం ఈ సాంగులో హైలెట్.బాహుబలి మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది.


 Baahubali: Sivuni Aana Full Video Song

త్వరలో బాహుబలి సినిమాను టీవీల్లో ప్రసారం చేయబోతున్నారు. అక్టోబర్ 25న బాహుబలి తెలుగు వెర్షన్ మాటీవీలో ప్రసారం కానుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఈ సినిమాకు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ రేటు కూడా భారీగా రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.


10 సెకన్ల యాడ్ కోసం పలు కంపెనీలు రూ. 2.5 లక్షలు చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. దీన్ని బట్టి బాహుబలి సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి రెండు పార్టులు కలిపి శాటిలైట్ రైట్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసారు. మరి ఇంత భారీ మొత్తం తిరిగా రావాలంటే యాడ్స్ రేట్లు ఈ మాత్రం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

English summary
Sivuni Aana Full Video Song from Baahubali released. Baahubali Starring Prabhas, Rana Dagubatti, Anushka Shetty and Tamannaah Bhatia in the lead roles.
Please Wait while comments are loading...