»   » లాగించండి: బాహుబలి స్పెషల్ ఆఫర్లు కేక...

లాగించండి: బాహుబలి స్పెషల్ ఆఫర్లు కేక...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి సినిమాకు వచ్చినంత క్రేజ్, ఇంత హైప్, ఇలా వందల కోట్ల కలెక్షన్ ఇప్పటి వరకు ఏ సినిమాకు రాలేదు. బాహుబలి సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు ఇరగదీస్తోంది. బాహుబలి సినిమాకు ఉన్న క్రేజ్ ను కొందరు తమ వ్యాపార వృద్ధికి ఉపయోగించుకుంటున్నారు.

బాహుబలి పేరుతో కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వారి వద్ద దొరికే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్‌కు రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా పేర్లు పెట్టేసారు. రాజమౌళి డ్రై ఐటం, ప్రభాస్ నాన్, అనుష్క కర్రీ, రానా రైస్, తమన్నా డ్రింక్స్ అంటూ థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నారు.


Baahubali Special Offers, Rana Daggubati Impressed

‘బాహుబలి' ప్రత్యేక ఆఫర్ల విషయం రానా దృష్టికి కూడా వచ్చింది. ఈ ఆఫర్లపై రానా ఇంప్రెస్ అయ్యాడు. ప్రేక్షకులు సినిమాను అమితంగా ఆదరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసాడు. ఇక బాహుబలి సినిమా విషయానికొస్తే ఈచిత్రం తొలి పది రోజుల్లో అన్ని బాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల మార్కునుకు అందుకుంది.

English summary
Baahubali is continuing to have it's dream run at the box office and in the meanwhile, every petty business man wants to make good out of it's name. Well! the craze around the film is such.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu