twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి, శ్రీమంతుడు రూ. కోటిన్నర స్కాం...సిబిఐకి పిర్యాదు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మనం ఇప్పటి వరకు రకరకాల స్కాంలు చూసాం. తాజాగా సరికొత్త స్కాం వెలుగులోకి వచ్చింది. సినిమా రంగంలో సేవా కార్యక్రమాల పేరుతో కొందరు భారీగా డబ్బులు దండుకునే స్కాంలు చేస్తున్నారని స్వయంగా నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. బాహుబలి, శ్రీమంతుడు సినిమాలకు బెనిఫిట్ షోల పేరుతో రూ. కోటిన్నర వరకు అక్రమంగా దండుకున్నారని నట్టికుమార్ ఆరోపిస్తున్నారు.

    సినిమా రంగంలో జరిగే స్కాంలకు అభిమానుల వెర్రి అభిమానమే పెట్టుబడి. వారి అభిమానాన్ని ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు దండుకుంటారు. సేవా కార్యక్రమాల పేరు చెప్పి వారి నమ్మిస్తారు. సినిమా చూసినట్లు ఉంటుంది.....సేవా కార్యక్రమాలకు తోడ్పడ్డట్లు ఉంటుందని అభిమానులు భారీగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ తెర వెనక జరుగుతున్నది వేరు.

    స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే.... హడావుడి ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బెనిఫిట్ షోల పేరుతో అర్థరాత్రి నుండి షోలు మొదలవుతాయి. మార్నింగు షోకు ముందే మూడు నాలుగు షోలు పడిపోతాయి. చారిటీ కోసం అంటూ రూ. 50 టిక్కెట్టు 500 నుండి రూ. 1000... ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటే 2000 వరకు అమ్మేస్తారు.

    వెర్రెక్కిన అభిమానులు తమ జేబులు గుల్ల చేసుకుంటారు. కొందరైతే ఇంట్లో అమ్మనాన్నలను వేధించి మరీ డబ్బు తీసుకొచ్చి బెనిఫిట్ షోలకు తగలేస్తారు. అలా అని ఈ డబ్బంతా షో నిర్వాహకులు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారా? అంటే.....అవును అని చెప్పడం కష్టమే.

    ఇలాంటి బెనిఫిట్ షోలు నిర్వహించడానికి పోలీసు డిపార్టుమెంటు, రెవెన్యూ డిపార్టుమెంటు కొంత మొత్తం(రూ. 5వేల లోపే) చెల్లించి అనుమతి తీసుకుని....తర్వాత లక్షలు దండుకుంటారు. అప్పట్లో బాహుబలి సినిమా విడుదల సమయంలో భారీ ఎత్తు ఇలాంటి షోలో వేసి చారిటీ ముసుగులో అక్రమంగా దండుకున్న వారు చాలానే ఉన్నారు. బాహుబలి సినిమా విషయంలోనే కాదు.... మహేష్ బాబు ‘శ్రీమంతుడు' ఇలా ప్రతి పెద్ద హీరో సినిమాలకు ఇలాంటి అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సార్లు అనుమతుల విషయంలో గొడవలు కూడా జరుగుతున్నాయి. అలా జరిగిన గొడవే ఇపుడు ఈ కుంభకోణం బయట పడటానికి కారణం అయిందని తెలుస్తోంది.

    కోటిన్నర స్కాం జరిగిందని చెబుతున్న నిర్మాత నట్టికుమార్ ఆరోపణలు స్లైడ్ షోలో....

    నట్టి కుమార్

    నట్టి కుమార్

    రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' మూవీ బెనిఫిట్ షో విషయంలో పెద్ద గొడవే జరిగింది. వైజాగ్ లో నట్టికుమార్ థియేటర్లో బ్రూస్ లీ అర్ధరాత్రి తర్వాత బెనిఫిట్ షో వేయడానికి అనుమతివ్వలేదు.

    లైసెన్స్ రద్దు

    లైసెన్స్ రద్దు

    ఉదయం ఏడున్నరకు షో మొదలుపెట్టాక కూడా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. అతని లైసెన్స్ కూడా రద్దు చేసారు.

    బయట పెట్టారు

    బయట పెట్టారు

    లైసెన్స్ రద్దు చేయడంతో....రగిలిపోతున్న నట్టి కుమార్ ఈ బెనిఫిట్ షోల పేరుతో నడుస్తున్న డబ్బులు దండుకునే వ్యవహారాన్ని బయట పెట్టారు.

    వాటికి ఇచ్చారు, బ్రూస్ లీకి ఇవ్వలేదు

    వాటికి ఇచ్చారు, బ్రూస్ లీకి ఇవ్వలేదు

    బాహుబలి సినిమాకు 23 థియేటర్లలో, శ్రీమంతుడుకి 18 థియేటర్లలో స్పెషల్ షోలకు విశాఖ జాయింట్ కలెక్టర్ అనుమతి ఇచ్చారని నట్టికుమార్ తెలిపారు.

    చారిటీకి ఉపయోగించలేదు

    చారిటీకి ఉపయోగించలేదు

    బాహుబలి, శ్రీమంతుడు బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన లాభాలను సేవాకార్యక్రమాలకు ఉపయోగించలేదని నట్టికుమార్ ఆరోపించారు.

    సిబిఐకి ఫిర్యాదు

    సిబిఐకి ఫిర్యాదు

    ఆ డబ్బును చారిటీకి ఉపయోగించక పోగా తమజేబులో వేసుకున్నారని నట్టికుమార్ ఆరోపించారు. దీనిపై ఆయన సీబీఐకి కూడా రిపోర్ట్ చేసారు.

    మంత్రి అల్లుడు, రెవెన్యూ అధికారి స్నేహితుడు

    మంత్రి అల్లుడు, రెవెన్యూ అధికారి స్నేహితుడు

    రెవెన్యూ ఉన్నతాథికారి స్నేహితుడు ఒకరు మంత్రి అల్లుడు ఒకరు కలిసి బాహుబలి - శ్రీమంతుడు బెనిఫిట్ షోల పేరిట కోటిన్నర కుంభకోణానికి పాల్పడ్డారన్నది నట్టి కుమార్ ఆరోపణ.

    English summary
    Natti Kumar allegations about Baahubali, Srimanthudu benifitshow scam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X