వాళ్లకు నచ్చని పని చేయను.. బాహుబలి, సాహో లాంటి భారీ చిత్రాలు ఎందుకు చేస్తున్నానంటే!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోలకు ధీటైన మార్కెట్ ఉన్న నటుడు ప్రభాస్ ఎదిగాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సాహో నిర్మాతలు 200 కోట్ల భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

దాదాపు ఐదేళ్లు
ప్రభాస్ చివరగా నటించిన చిత్రం బాహుబలి 2. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ దాదాపు ఐదేళ్ల సమయం కేటాయించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. బాహుబలి తర్వాత అయినా ప్రభాస్ వేగంగా సినిమా చేస్తాడని భావించారు. కానీ అది జరగలేదు. అందుకు కారణం ప్రభాస్ మరో భారీ బడ్జెట్ చిత్రం సాహోని ఎంపిక చేసుకున్నాడు.

ప్రతి రోజూ కష్టపడుతుంటా
ప్రభాస్ తన అభిమానుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంతటి అభిమానం పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులు నాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుని ఉంటారు. వారి అంచనాలు అందుకోవడానికి ప్రతి రోజూ కష్టపడుతుంటా. నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని ప్రభాస్ తెలిపాడు. తాను నటించే ప్రతి చిత్రం అభిమానులకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలని భావిస్తానని ప్రభాస్ తెలిపాడు.

వరుసగా భారీ చిత్రాలు
తాను ఎందుకు వరుసగా బాహుబలి, సాహో లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నానో ప్రభాస్ వివరించాడు. బాహుబలి తరహాలోనే సాహోపై కూడా అంచనాలు ఉన్నాయి. నేను ఎంచుకునే ప్రతి కథ నా అభిమానుల కోసమే. నానుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ అంశాలే నా చిత్రాల్లో ఉంటాయి. బాహుబలి తర్వాత సాహో కథని ఎంచుకున్నా. అందులో నా పాత్రని మలచిన విధానం బాగా నచ్చింది అని ప్రభాస్ తెలిపాడు. ఒక చిత్రానికి ఓకే చెప్పే ముందే నాకు నేనుగా కొన్ని ప్రశ్నలు వేసుకుంటా.. వాటన్నింటికి సమాధానం దొరికితే అంగీకారం తెలుపుతానని ప్రభాస్ తెలిపాడు.

పీరియాడిక్ నేపథ్యంలో
సాహో చిత్రంతో పాటు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రం 1960 కాలంలో యూరప్ లో జరిగే కథగా తెరకెక్కుతుందట. వరుసగా భారీ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ కు ఇది కూడా ఓ ఛాలెంజింగ్ మూవీ.


Click it and Unblock the Notifications











