Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్పై రానా ట్వీట్.. ఆ సౌండ్ ట్రాక్‌కి ఫిదా అయిపోయా!
గత ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం కేజీఎఫ్ ఘనవిజయం సాధించింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ హీరో యష్ క్రేజ్ ని కెజిఎఫ్ చిత్రం మరింతగా పెంచింది. ఈ చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాష్ ని ఓ సూపర్ హీరోలా చూపించాడు. ఈ మధ్య కాలంలో హీరోయిజాన్ని ఇంతగా హైలైట్ చేసిన చిత్రం ఇదే అని చెప్పొచ్చు. అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వెనుకున్న కథని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా చూపించాడు.
చాలా ఆలస్యంగా
కెజిఎఫ్ చిత్రంపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చాలా ఆలస్యమైనప్పటికీ దగ్గుబాటి రానా కూడా తాజాగా కెజిఎఫ్ చిత్రం గురించి ట్వీట్ చేశాడు. ఆలస్యమైందని తెలుసు. కానీ ఎట్టకేలకు కెజిఎఫ్ చిత్రాన్ని చూశా. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కు రానా శుభాంక్షాలు తెలిపాడు.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్కు ఫిదా
కెజిఎఫ్ చిత్రంలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా నిలిచినా అంశాలలో బ్యాగ్ గ్రౌండ్ సంగీతం ఒకటి. ధీర ధీర ధీర సౌండ్ ట్రాక్ కు ఫిదా అయ్యానని రానా తెలిపాడు. రానా ట్వీట్ పై హీరో యష్ స్పందించాడు. మంచి విషయం కోసం కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. థాంక్యూ రానా అని యష్ ట్వీట్ చేశాడు. నువ్వు ఎప్పుడూ సపోర్టివ్ గా ఉన్నావు. త్వరలో మనమిద్దరం కలుద్దాం రానా అని యష్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
వసూళ్ల వర్షం
కెజిఎఫ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో ఈచిత్రం జయకేతనం ఎగురవేసింది. కోలార్ బంగారం గనుల నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో యష్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులని పిచ్చెక్కించాయి. హీరోయిజంకు ధీటుగా దర్శకుడు విలనిజాన్ని కూడా చూపించాడు.
ఏప్రిల్‌లో విడుదల
ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. తొలి భాగంలో కెజిఎఫ్ ని ఏలుతున్న విలన్ ని చంపేసిన హీరో.. రెండవ భాగంలో కెజిఎఫ్ కు డాన్ గా ఎలా మారాడు.. మిగిలిన విలన్లు అతడిపై ఎలాంటి కుట్రలు పన్నారు అనే ఉత్కంఠ భరిత అంశాలు రెండవ భాగంలో చూపించనున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.