Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘బాహుబలి’ పార్ట్-1 షూటింగ్ పూర్తయింది
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాకు టాకీ పార్టు పూర్తయింది. జనవరి 24న ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. ఇక దర్శకుడు రాజమౌళి అండ్ టీం పోస్టు ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టారు. షూటింగ్ మొదలైనప్పటి నుండే పారలాల్ గా డబ్బింగ్ మొదలు పెట్టడంతో తెలుగు, తమిళం బాషల్లో ‘బాహుబలి' పార్ట్ -1కు సంబంధించిన అందరు ఆర్టిస్టుల డబ్బింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగుతో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఇందుకు సంబంధించిన పనులు ఫిబ్రవరిలో మొదలు కానున్నాయి. ప్రముఖ సౌండ్ ఇజనీర్ పి.ఎం.సతీష్ సౌండ్ డిజైన్ మీద, డెబాజిత్ చాంగ్‌మై సౌండ్ మిక్సింగ్ మీద పని చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోరు, సంగీతం అద్భుతంగా రావడానికి ఎంఎం కీరవాణి రాత్రి పగలనక కృష్టిచేస్తున్నారు.

ఇక పోస్టు ప్రొడక్షన్ పనుల్లో అతి ముఖ్యమైన ‘విఎఫ్ఎక్స్' పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విభాగంలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్సన్ శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇండియా, హాంకాంగ్, యూనైటెడ్ స్టేట్స్ లోని వివిధ స్టూడియోల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్, ఆడియో వేడుక, ట్రైలర్స్ ఎప్పుడు అనే విషయం త్వరలో టీం బాహుబలి వారు వెల్లడించనున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేటన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.
ప్రభాస్ కెరీర్లో ఈ సినిమా ఓ గొప్ప మైలురాయిగా ఉంటుందని అంటున్నారు. మరో వైపు అనుష్క, రానా కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం యావత్ తెగులు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.