For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభాస్ పిచ్చోడు.. మళ్లీ అలాంటి తప్పు చేయను.. రాజమౌళి..

By Rajababu
|

బాహుబలి చిత్రంతో జూనియర్ రెబల్‌స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి నటుడయ్యాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు ఎంతో పేరు తెచ్చింది. దాదాపు ఇతర చిత్రాల్లో నటించకుండా బాహుబలికే అంకితం అయ్యాడు. అలాంటి ప్రభాస్‌పై సంచలన దర్శకుడు రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రభాస్‌తోనే సాధ్యమైంది

హాలీవుడ్ స్థాయి ఏ మాత్రం తగ్గని విధంగా బాహుబలి లాంటి చిత్రం సాధ్యపడిందంటే అందుకు కారణం ప్రభాస్. ప్రభాస్ పిచ్చోడు. అలాంటి వ్యక్తి ఉంటేనే ఇలాంటి సినిమాలు సాధ్యపడుతాయి. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు అని రాజమౌళి అన్నారు.

అలాంటి తప్పు మళ్లీ చేయను..

అవార్డుల కోసం నేను సినిమాలు తీయను. ఒకవేళ నా చిత్రాలకు పురస్కారాలు వస్తే ఆనందిస్తాను. ‘బాహుబలి2 చిత్రంలో కనిపించను. అలాంటి తప్పు మళ్లీ చేయను' అని బాహుబలి1 చిత్రంలో మనోహరి పాటలో కనిపించిన విధంగానే కనిపిస్తారా అనే ప్రశ్నకు రాజమౌళి అలా సమాధానమిచ్చారు.

పోటీ లేదు.. గర్వంగా ఉంది

శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న రోబో 2.0, బాహుబలి2 చిత్రాల మధ్య పోటీ అసలే లేదు. ఈ రెండు చిత్రాలు వేర్వేరు నేపథ్యాలతో కూడుకొన్నవి. ఇండియన్ సినిమా పాపులారిటీ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళే చిత్రాలు దక్షిణాది నుంచి రావడం గర్వంగా ఉంది అని జక్కన్న అన్నారు.

సినిమాను చూడటానికి ఆతృత

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నను చాలా మంది అడుగుతున్నారు. అయితే వారంతా సమాధానం ఆశించడం లేదు. ఎందుకంటే సినిమాను చూడటానికి ఆతృతతో ఉన్నారు అని సెన్సేషనల్ డైరెక్టర్ పేర్కొన్నారు.

గతమంటనే ఇష్టం..

తదుపరి చిత్రంలో విజ్వువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)కు అవకాశం ఉండదు. సైన్స్ ఫిక్షన్ సినిమాలపై ఆసక్తి లేదు. నాకు భవిష్యత్ కంటే గతమే ఇష్టం అని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

చెన్నైలో బాహుబలి2 తమిళ ఆడియో

బాహుబలి తమిళ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ పలు విషయాలను మీడియాకు వెల్లడించారు.

మణిరత్నం, బాపు, రాజమౌళి ఇష్టం

మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ.. దేశంలో నాకు ఇష్టమైన దర్శకులు ఇద్దరే. వారిలో ఒకరు మణిరత్నం. మరొకరు బాపు. ఆ తర్వాత రాజమౌళి అని అన్నారు. వీరిలో ఎవరో ఒకరు గురించి చెప్పాల్సి వస్తే అది రాజమౌళి అని అన్నారు. బాహుబలి పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోవద్దనే నిబంధన పెట్టుకోలేదు. అలాంటి వార్తలన్నీ రూమర్లే అని అన్నారు.

ఏప్రిల్ 28న ..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. దాదాపు రూ.200 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం దాదాపు దేశవ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల అవుతున్నది.

English summary
Baahubali Tamil audio launched on Sunday at YMCA ground in Chennai with grand. In this function, Rajamouli, Prabhas, Anushka Shetty, Tamannaah and Ramya Krishna attended. Rajmouli said that Prabhas is mad fellow for Baahubali. Because of his committment it becomes reality on screen.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more