బాహుబలి టీం ఫన్నీ పిక్.... (వీక్షించండి)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో ‘బాహుబలి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడమే లక్ష్యంగా టీం మొత్తం కష్టపడి పని చేస్తోంది. సోషల్ నెట్వర్కింగులో యాక్టివ్‌గా బాహుబలి టీం తాజాగా ఓ ఫన్నీ పిక్ పోస్టు చేసారు. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. 2015 వేసవిలో తొలి భాగం వస్తుందని అంటున్నారు. ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.
మేము సైతం కోసం బాహుబలి టీం
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అంటూ చేయి చేయి కలిపింది టాలీవుడ్. ఈనెల 30వ తేదీన ఏకధాటిగా 12 గంటల పాటు వినోద కార్యక్రమాలను నిర్వహించబోతోంది. క్రికెట్, కబడ్డీ, గేమ్‌షోలూ, అంత్యాక్షరి, స్కిట్స్.. ఇలా ఎన్నెన్నో సరదాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా..రాజమౌళి కూడా ఓ స్కిట్ ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బాహుబలి టీమ్ ...ప్రభాస్,అనుష్క, రానా, కీరవాణి, తమన్నా తదితరులతో ఈ స్కిట్ ఉండబోతోందని చెప్తున్నారు. అలాగే ఈ స్కిట్ పీరియడ్ డ్రామా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ స్కిట్ కి రాజమౌళి డైరక్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











