మేము సైతం: ‘బాహుబలి’ టీం అందుకే డుమ్మా!
హైదరాబాద్: హుదూధ్ తుఫాన్ బాధితుల సహాయార్థం టాలీవుడ్ అంతా కలిసి నిర్వహించిన ‘మేము సైతం' కార్యక్రమానికి ‘బాహుబలి' చిత్ర యూనిట్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అయితే వారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోయినా వారు చేసిన స్కిట్ వీడియో రూపంలో ప్రదర్శించారు. అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ స్కిట్ ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' అందుబాటులో లేక పోవడంతో రాలేక పోయారని తెలుస్తోంది. బాహుబలి చిత్ర యూనిట్ షూటింగ్ నిమిత్తం బల్గేరియా వెళ్లింది. అదన్నమాట సంగతి. ఆర్కా మీడియా బేనర్లో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో ‘బాహుబలి' చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడమే లక్ష్యంగా టీం మొత్తం కష్టపడి పని చేస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఈ చిత్రం తెలుగు ప్రాంతానికో, ఇండియాకో పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగిన విధంగానే చిత్రీకరణ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











