»   » ప్రముఖుడి హఠాన్మరణం: బాహుబలి-2 స్పెషల్ షోలు రద్దు!

ప్రముఖుడి హఠాన్మరణం: బాహుబలి-2 స్పెషల్ షోలు రద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాహుబలి 2 సినిమా విడుదలకు సిద్దమైంది. మరికొన్ని గంటల్లో స్పెషల్ షోలు చూస్తాం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సీక్రెట్ తెలుసుకుందామనే సంతోషంలో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. అయితే ఆ ఆనందం తీకక ముందే అనుకోని విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా అనారోగ్యంతో మరణించారు. ఊహించని ఈ విషాద సంఘటన ఎఫెక్ట్ బాహుబలి-2 ప్రీమియర్ షోలమీద పడింది. వినోద్ ఖన్నా మృతికి సంతాపంగా బాహుబలి 2 స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు.

వినోద్ ఖాన్నా గౌరవార్థం

వినోద్ ఖన్నా గౌరవార్థం బాహుబలి-2 స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు

బాహుబలి టీం మొత్తం తీసుకున్న నిర్ణయం

బాహుబలి టీం మొత్తం తీసుకున్న నిర్ణయం

బాహుబలి టీం మొత్తం వినోద్ ఖన్నాకు సంతాపంగా తీసుకున్న నిర్ణయమిది. ఈ రోజు రాత్రి వేయాల్సిన బాహుబలి ప్రీమియర్‌ను రద్దు చేస్తున్నామని కరణ్ జోహార్ తెలిపారు.

వినోద్ ఖన్నా

వినోద్ ఖన్నా

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా గురువారం మరణించారు. కొంతకాలంగా ఆయన కేన్సర్ తో బాధ పడుతున్నారు. వినోద్ ఖన్నాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బాహుబలి 2 ఫీవర్

బాహుబలి 2 ఫీవర్

ఇపుడు ఎక్కడ చూసినా బాహుబలి 2 ఫీవరే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతున్న తరుణంలో సినిమాకు సంబంధించి ఏ అంశం బయటకు వచ్చిన ఆసక్తిగా చూస్తున్నారు. బాహుబలి 2 కు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

English summary
"As a mark of respect to our beloved Vinod Khanna the entire team of Baahubali has decided to cancel the premiere tonight" Karan Johar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu