ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఇంటర్వ్యూ, పెళ్లి గురించి..

By Bojja Kumar

హైదరాబాద్: బాహుబలి థియేట్రికల్ ట్రైలర్ వెబ్ లో విడుదల చేసే మందు ఈ చిత్ర ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ట్విట్టర్ ద్వారా అభిమానులతో తమ అనుభవాలు పంచుకున్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. అవేమిటో చూద్దాం..

ప్రశ్న: మీ ఫేవరెట్ రోల్ ఏమిటి?... శివుడు లేదా బాహుబలి?
ప్రభాస్: శివుడు కంటే బాహుబలి రోల్ బెటర్ గా ఉంటుంది.

ప్రశ్న: బాహుబలి షూటింగ్ సమయంలో మీ ఫిజిక్ ఎలా మెయింటేన్ చేసారు?(ప్రభాస్ ను అడిగిన ఈ ప్రశ్నకు అనుష్క సమాధానం ఇచ్చింది)
అనుష్క: రెండున్నర సంవత్సరాలు డిసిప్లేన్ గా వర్కౌట్ చేయడం, అందుకు అవసరమైన డైట్ తీసుకోవడం.

Baahubali Team interacted with fans

ప్రశ్న: మీ టీంలో బెటర్ పెర్ఫార్మెర్ ఎవరు?
అనుష్క: రమ్య కృష్ణ
తమన్నా: రమ్యకృష్ణ
రానా: బల్లలదేవ
ప్రభాస్: రమ్య కృష్ణ, సత్యరాజ్, రానా, స్వీటీ, తమన్నా, ప్రభాస్

ప్రశ్న: బాహుబలి లో చాలా కష్టమైన ఘట్టం
అనుష్క: ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేయడం, తర్వాత ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయడం, షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ ప్లాన్ చేయడం, పోస్టు ప్రొడక్షన్ పూర్తి చేయడం..
తమన్నా: సినిమాలో ప్రభాస్ తో నేను ఫైట్ చేసే సీన్. అది చాలా కష్టమైంది. ప్రభాస్ తో పోరాటం అంటే చాలా కష్టం...నేను ఎలా చేయగలను.

ప్రశ్న: బాహుబలిలో నటించడానికి కారణం?
అనుష్క: రాజమౌలి బాహుబలి స్క్రిప్టుతో రావడమే...
తమన్నా: రాజమౌళి
రానా: ప్రభాస్ తో కలిసి చేయడం, ఇండియాలోనే గ్రేట్ ఫిల్మ్ కావడం.
ప్రభాస్: అందరూ బాగా చెప్పారు..నేనేం చెప్పాలి ఇపుడు(అంతా నవ్వారు)

ప్రశ్న: షూటింగ్ సమయంలో ఇరిటేట్ అయిన సందర్భం?
అనుష్క: నేను ఆ విషయాన్ని చెప్పదలుచుకోలేదు.
తమన్నా: ఓసారి షూటింగ్ జరుగుతుండగా భారీగా వర్షం పడింది. షూటింగ్ ప్యాకప్ చెబుతారని అనుకున్నాను. అయితే అలా చేయలేదు. షూటింగ్ కంటిన్యూ చేసారు.
రానా: ఓ యాక్షన్ సన్నివేశం చేయడానికి వీల్ చెయిర్ మీద రావడం.
ప్రభాస్: నేను చేసిన యాక్షన్ సన్నివేశాలన్నీ...

ప్రశ్న: మీరు ‘బాహుబలి' సినిమాను ఎవరైనా ప్రముఖ వ్యక్తికి చూపించాలని అనుకుంటున్నారా?
అనుష్క: రజనీకాంత్
తమన్నా: ముందు నేను చూడాలనుకుంటున్నాను
రానా: అమితాబ్ బచ్చన్
ప్రభాస్: రజనీకాంత్

ప్రశ్న: మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ప్రభాస్?
ప్రభాస్: త్వరలో...ఓ మంచి రోజు చూసి
తమన్నా: నువ్వు ఎప్పుడు చేసుకుంటావ్ అనుష్క?
అనుష్క: రానా చేసుకున్న తర్వాత?
తమన్నా: నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ రానా?
రానా: అయినా నన్నెవరు చేసుకుంటారండీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X