ఫన్ అదిరింది‌: 'బాహుబలి' టీమ్... వంటలు స్కిట్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: 'మేముసైతం' వినోద కార్యక్రమాల్లో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో 'బాహుబలి' బృందం సందడి చేసింది. ప్రభాస్‌-వల్లి, రానా-సెంథిల్‌కుమార్‌, శోభుయార్లగడ్డ- అనుష్క, రాజమౌళి-తమన్నా జట్లుగా ఏర్పడి వంటలు చేశారు. ఇంతకీ వీరు ఎలా వంటలు చేసారో వీడియో చూడండి...

రాజమౌళి ఇంటివద్ద జరిగిన ‘బాహుబలి' పాటల వంటల పోటీలో రాజమౌళి, ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, కీరవాణి, భోగవల్లి ప్రసాద్‌, శోభు యార్లగడ్డ, శ్రీవల్లి, రమా రాజమౌళి, సెంథిల్‌కుమార్‌, సాబు సిరిల్‌, ప్రశాంతి పాల్గొని పాటలు పాడుతూ, వంటలు చేస్తూ వినోదం పంచారు.

Baahubali Team Skit At Memu Saitham

ఆర్ట్‌ డైరక్టర్‌ సాబుశిరిల్‌ కిళ్లీలు కట్టడంలో హడావిడిగా కన్పించారు. రానా గోధుమపిండి పిసికి చపాతీలు చేశారు. రాజమౌళి పెరుగన్నం తయారు చేశారు. కీరవాణి పాయసం తయారు చేశారు. శోభుయార్లగడ్డ చేపలకూర, ప్రభాస్‌ వెజిటెబుల్‌ కర్రీలను చేయగా, వాటిని బీవీవీఎన్‌ ప్రసాద్‌ రుచి చూశారు. ఎవరి వంట బాగుందని ప్రశ్నించగా, ప్రభాస్‌ది బాగుందని చెపుతూనే చివరకు తానే గెలిచానని చెప్పారు.

రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు ప్రజలకు ఎప్పుడు ఆపద కలిగినా, ఆదుకోవడానికి ముందుకొచ్చిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ సారి ఉత్తరాంధ్ర హుద్‌హుద్‌ పెను తుపాను బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ‘మేము సైతం' అంటూ కదిలింది. చిత్రసీమకు చెందిన పలు శాఖలవారు ఒక్కటై చేసిన ‘మేము సైతం' కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పన్నెండు గంటల వరకు ఆద్యంతం వినోదభరితంగా, కన్నులపండువగా జరిగింది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగగా, ఆ తర్వాత నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో కబడ్డీ, క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఎనిమిదేళ్ల క్రితం అత్యంత వైభవంగా జరిగిన తెలుగు చిత్రసీమ వజ్రోత్సవాల అనంతరం పరిశ్రమలోని అత్యధికులు పాల్గొన్న కార్యక్రమం ‘మేము సైతం' అని చెప్పాలి.

ఈ కార్యక్రమం ద్వారా హుద్‌హుద్‌ బాధితులకు చిత్రసీమ ఎంత అందజేస్తుందన్నది ముఖ్యం కాదనీ, తాము అందించిన స్ఫూర్తిని మాత్రమే చూడాలని దాసరి నారాయణరావు తెలిపారు. చిత్రసీమ యావత్తూ ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని మోహన్‌బాబు చెప్పగా, తెలుగువాళ్లకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, నేనున్నానంటూ చిత్రసీమ భరోసానిస్తూ వచ్చిందని బాలకృష్ణ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X