ఉమెన్స్ డే: ‘బాహుబలి’ మూవీ టీం ఇలా...
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామెజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాహుబలి టీం మహిళలకు సోషల్ నెటర్కింగు ద్వారా గ్రీటింగ్స్ తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. బాహుబలి టీంలో రామమౌళి భార్య రమతో పాటు అనేక మంది మహిళలు పని చేస్తున్నారు. వారు పని చేయడానికి వీలున్న అన్ని విభాగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నారు.
భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












