‘బాహుబలి’ టీజర్ ఈ రాత్రికే....
హైదరాబాద్: తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్టులో ముందు వరుసలో ఉన్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాతదితరులు నటిస్తున్న ‘బాహుబలి'. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అంశం అయినా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్. ఈ రోజు రాత్రికే బాహుబలి టీజర్ బయటకు రాబోతోంది. ఈ విషయాన్ని రానా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
వాస్తవానికి ఈ నెల 31న సినిమా ఆడియో విడుదల కావాల్సి ఉంది. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి లభించక పోవడంతో వాయిదా పడింది. ఈ నెల 31న బాహుబలి ఆడియో వేడుక చేయాలనుకున్నామని, అయితే సెక్యూరిటీ కారణాల వల్ల పోలీసుల నుండి అనుమతి లభించలేదు. అందుకే ఆడియో వేడుక వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా జరిగినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అని రాజమౌళి ఇటీవల ప్రెస్ మీట్లో తెలిపారు.
‘బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్' పేరుతో విడుదల చేయబోతున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత బాహుబలి పార్ట్-2 విడుదల చేయనున్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ‘బాహుబలి పార్ట్-2' కు సంబంధించిన విషయాలు వెల్లడించారు రాజమౌళి.

‘బాహుబలి' పార్ట్-1 షూటింగ్ పూర్తయిందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. సినిమా నిడివి 2.32 నిమిషాలు ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసారు. అదే విధంగా బాహుబలి పార్ట్-2 షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు.


Click it and Unblock the Notifications











