బాహుబలి టీజర్ ఇదిగో (వీడియో)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘బాహుబలి'. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు...భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రం కాబోతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంబందించిన 5 సెకన్ల నిడివిగల టీజర్ విడుదలైంది.

రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ జూన్ 1న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న సినిమా ఆడియో విడుదల కావాల్సి ఉంది. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి లభించక పోవడంతో వాయిదా పడింది. ఈ నెల 31న బాహుబలి ఆడియో వేడుక చేయాలనుకున్నామని, అయితే సెక్యూరిటీ కారణాల వల్ల పోలీసుల నుండి అనుమతి లభించలేదు. అందుకే ఆడియో వేడుక వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా జరిగినందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అని రాజమౌళి ఇటీవల ప్రెస్ మీట్లో తెలిపారు.


Click it and Unblock the Notifications











