వీడియో: 'బాహుబలి' ఆడియో లాంచ్ ప్రోమో

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా పాటల్ని ఈ నెల 13న ,తిరుపతిలో విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో బాహుబలి టీమ్ ఆడియో లాంచ్ ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో ఇప్పుడు సినీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. మీరూ ఈ ప్రోమో ని ఇక్కడ మీరూ చూడండి.

చిత్రం ఆడియోను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్టర్‌లో తెలిపింది. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Baahubali - The Beginning Audio Launch Promo

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Baahubali - The Beginning Audio Launch Promo

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X