»   » ముంబైలో ‘బాహుబలి’ టీం సందడి (ఫోటోస్)

ముంబైలో ‘బాహుబలి’ టీం సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో సోమవారం గ్రాండ్ గా జరిగింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ వెర్షన్లో కూడా ‘బాహుబలి' తెరకెక్కిస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించారు. హిందీలో ఈ చిత్రం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళితో పాటు ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు హాజయ్యారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్... ‘బాహుబలి' టీంను ఇంట్రడ్యూస్ చేసారు.


దాదాపు రెండున్నరేళ్ల పాటు బాహుబలి షూటింగ్ కొసాగింది. గతంలో ఏ తెలుగు సినిమాలో లేని విధంగా భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్, పోరాట సన్నివేశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వార్ మూవీని ‘బాహుబలి' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.


సినిమా నిర్మాణంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులను గురించి ఈ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు. కరణ్ జోహార్ లాంటి ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న నేపథ్యంలో సినిమాపై ముందు నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా హిందీ వెర్షన్ ‘బాహుబలి' విడుదలైన తర్వాత బాలీవుడ్ సర్కిల్ లో ఈ మూవీ హాట్ టాపిక్ అయింది.


స్లైడ్ షోలో ఫోటోస్..


బాహుబలి టీం

బాహుబలి టీం

బాహుబలి టీంను బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్న ప్రఖ్యాత బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.


రాజమౌళి

రాజమౌళి

బాహుబలి సినిమా నిర్మాణంలోని లోటు పాట్లను వివరిస్తున్న రాజమౌళి.


టీం

టీం

బాహుబలి టీం ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తదితరులు...


మీడియా

మీడియా

బాలీవుడ్ హిందీ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంటను కవర్ చేస్తున్న బాలీవుడ్ మీడియా
English summary
'Baahubali - The Beginning' hindi Theatrical Trailer launch event held at Mumbai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu