»   » వావ్ అద్భుతం: బాహుబలి సెకండ్ ట్రైలర్ ఇదే (వీడియో)

వావ్ అద్భుతం: బాహుబలి సెకండ్ ట్రైలర్ ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ విడుదలైంది. తొలుత విడుదలైన ట్రైలర్‌ను మించి పోయేలా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఆ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి.


‘బాహుబలి' సినిమా జులై 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ అడ్వాన్డ్స్ బుకింగ్ గడిచిన శుక్రవారమే మొదలైంది. థియేటర్ల వద్ద, ఆన్ లైన్ సైట్లలో కూడా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బాహుబలి సినిమా అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఆన్ లైన్ సదుపాయం ఉన్నవారు ఆ దిశగా టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.


టికెట్స్ ఏ థియేటర్లో పెట్టినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. డిమాండును దృష్టిలో పెట్టుకుని క్రమక్రమంగా థియేటర్ల సంఖ్య కూడా పెంచుతున్నారు. ఇప్పటికే హైదరాబాదులో సగానికి పైగా థియేటర్లు కేవలం ఈ సినిమాకే రిజర్వ్ అయ్యాయి.


Baahubali - The Beginning Release Trailer

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.

English summary
Watch Baahubali New Trailer. Movie releasing on July 10th 2015.
Please Wait while comments are loading...