»   » ‘బాహుబలి - 2’ : కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పిన రాజమౌళి (ఫొటో)

‘బాహుబలి - 2’ : కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పిన రాజమౌళి (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి - 2'. ముఖ్యంగా కట్టప్ప... బాహుబలిని ఎందుకు చంపాడో కంక్లూజన్ దొరుకుతుందని,రకరకాల స్పెక్యులేషన్స్ తో వెయిట్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా రాజమౌళి ఈ చిత్రం కథని తమ టీమ్ కు నేరేట్ చేయటం జరిగింది. ఆ ఫొటో ని నిర్మాత శోభు తన ట్విట్టర్ లో ఫోస్ట్ చేసారు. దాన్ని ఇక్కడ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మరో ప్రక్క .....ఈ చిత్రం మొదట అనుకున్న తేదీన కాకుండా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ కు ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. స్క్రిప్టు ఇంకా ఫైన్ ట్యూన్ కాకపోవటమే ఈ లేటుకు కారణం అని తెలుస్తోంది. రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు పైనే పనిచేస్టున్నట్లు సమాచారం. మొదట జనవరి 8, 2016 న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు..కానీ ఇప్పుడు మారిందని చెప్పుకుంటున్నారు.


 Baahubali - The Conclusion Story Narrated By SSR

'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా. టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.


భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టి 50 రోజుల పండుగ ఈ మధ్యనే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.


English summary
"Just In!"Baahubali - The Conclusion" story being narrated by SS Rajamouli to the film unit" Baahubali handle posted
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu