»   » 'బాహుబలి -2‌' కి చీఫ్ టెక్నీషియన్ ని మార్చేసారు

'బాహుబలి -2‌' కి చీఫ్ టెక్నీషియన్ ని మార్చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖుల మన్ననలు పొందిన తెలుగు చిత్రం 'బాహుబలి'. ఇటీవల విడుదలైన 'బాహుబలి ది బిగినింగ్‌'తో మొదలు పెట్టిన కథ 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'తో ముగుస్తుంది. ఈ చిత్ర రెండో అంకాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు రాజమౌళి కసరత్తు ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాహుబలి సాంకేతిక బృందంలో కొత్త సభ్యుడు చేరారు. ఆయన మరెవరో కాదు రాజమౌళి మగధీర, ఈగ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ అందించిన ఆర్‌.సి.కమలాకణ్ణన్‌. శ్రీనివాస్‌ మోహన్‌ స్థానంలో కమలాకణ్ణన్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తారని చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది.వీఎఫ్‌ఎక్స్‌ విభాగంలో రెండు జాతీయ స్థాయి పురస్కారాలను కణ్ణన్‌ అందుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా 'బాహుబలి' రెండో భాగం కోసం రాజమౌళి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లడమే లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం కొత్త బృందాన్ని నియమించారు.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ బాహుబలి-2లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె అనుష్క సిస్టర్ గా, కుంతల రాజ్యం మహారాణిగా కనిపించబోతోందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన వెలువడనుంది.


Baahubali: The conclusion VFX supervisor RC Kamal kannan

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ బాహుబలి-2లో బాలీవుడ్ నుండి కొందరిని సినిమాలో తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, అప్పుడే బాలీవుడ్లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని సూచించాడని, అందులో భాగంగానే మాధురి దీక్షిత్ ను గెస్ట్ రోల్ కు రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


English summary
Srinivas Mohan has quit Baahubali's 2 part as he is already committed to work on Shankar's Robo 2 from January. However, Baahubali unit has found a fitting replacement already in the form of RC Kamalkannan. Kamal was the VFX supervisor for Rajamouli's Magadheera and Eega. He even won the coveted National Award for Best Visual Effects for Magadheera.
Please Wait while comments are loading...