»   » ‘బాహుబల్’ యానిమేటెడ్ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్

‘బాహుబల్’ యానిమేటెడ్ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బాహుబలి' ప్రాజెక్టును కేవలం రెండు సిరీస్ లతో ఆపాలని చూడటం లేదు. బాహుబలి ప్రాంచైజీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బాహుబలికి మరిన్ని సీక్వెల్స్ తో పాటు... యానిమేటెడ్ సిరీస్, వర్చువల్ రియాల్టీ వీడియోలు ఇలా చాలా ప్లాన్ చేస్తున్నారు.

శుక్రవారం జరిగిన బాహుబలి-2 ప్రెస్ మీట్లో ఇందుకు సంబంధించిన విషయాలన్నీ రాజమౌళి తెలిపారు. బాహుబ‌లి టీమ్‌కి అక్టోబ‌ర్ ఎగ్జ‌యిట్‌మెంట్ మంత్‌. బాహుబ‌లికి సంబంధించిన ర‌క‌ర‌కాల విష‌యాలు అక్టోబ‌ర్‌లోనే విడుద‌ల‌వుతాయి. బాహుబ‌లి సీరీస్ యామెజాన్ ప్రైమ్‌లో రానుంది. 'బాహుబలి-ది లాస్ట్ లెజెండ్స్' పేరుతో ఇది రాబోతోంది. దానికి సంబంధించిన టీజ‌ర్ అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుందన్నారు.


బాహుబలి ప్రెస్ మీట్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది లింకులో...


బాహుబలి-2 ప్రెస్ మీట్ పూర్తి వివరాలు...


'Baahubali - The Lost Legends

ఇక బాహుబలి మూవీ షూటింగ్ వివరాల్లోకి వెళితే... ముఖ్య ఎపిసోడ్స్‌ అన్నీ పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో కొన్ని రోజుల్లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తవుతుందట. కొన్ని సీన్స్‌, సాంగ్స్‌ చిత్రీకరించాల్సి ఉందని నిర్మాతలు తెలిపారు.


ఏప్రిల్‌ 28న బాహుబలి 2 విడుదల చేస్తున్నారు. జనవరిలో ట్రైలర్ రాబోతోంది. సినిమా రిలీజ్ కు ఆరు నెలల ముందు నుండే ప్రమోషన్స్ ప్రారంభించడం ద్వారా సినిమాపై నేషనల్ వైడ్ హైప్ తేవడమే బాహుబలి టీం లక్ష్యంగా కనిపిస్తోంది.

English summary
The teaser for Baahubali's animated series, 'Baahubali The Lost Legends' will be released on Amazon today. Stay tuned!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu