»   »  తెలుగులో తొలిసారి: సరికొత్త టెక్నాలజీతో బాహుబలి ట్రైలర్

తెలుగులో తొలిసారి: సరికొత్త టెక్నాలజీతో బాహుబలి ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా మాత్రమే కాదు.... ట్రైలర్ కూడా హాట్ టాపిక్ కాబోతోంది. ట్రైలర్ లో అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ వాడుతున్నారు. కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో రూపొందించిన ట్రైలర్ ప్రేక్షకులకు హై క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. తెలుగులో తొలిసారిగా 'బాహుబలి' కోసం ఈ టెక్నాలజీ వాడారు. ప్రముఖ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ట్రైలర్ నిడివి రెండు నిమిషాల 5 సెకన్లు ఉండనుంది.

‘బాహుబలి' హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జూన్ 1న విడుదల చేయనున్నారు. హిందీలో ఈచిత్రాన్ని కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్ సంస్థ విడుదల చేయనుంది. ఈ నెల 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే భారీ వేడుకలో 'బాహుబలి' ఫస్ట్‌పార్ట్ తెలుగు, తమిళ పాటలు విడుదల చేయనున్నారు. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Baahubali trailer to launch in dolby atmos sound

‘బాహుబలి' సినిమాకు సంబంధించి బయటకు పొక్కుతున్న విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ఏమంటే ఈ చిత్రంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే రూ. 70 కోట్ల మేర ఖర్చు చేసారట. నేషనల్ అవార్డు విన్నర్, ‘మ్యాజిక్ మ్యాజిక్', ‘శివాజి', ‘రోబో' చిత్రాలకు సూపర్ వైజింగ్ చేసిన విఎఫ్ఎక్స్ ఎక్స్‌పర్ట్ శ్రీనివాస్ మోహన్ ‘బాహుబలి' చిత్రానికి కూడా పని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 600 మంది మంది గ్రాఫిక్స్ నిపుణులు పని చేస్తున్నారు.

సాధారణంగా 10 సెకన్ల నిడివిగల విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం రూ. 50 వేలు ఖర్చవుతుంది. బాహుబలి సినిమాలో 95 శాతం గ్రాఫిక్స్ మాయాజాలమే. అందుకే నిర్మాతలు ఏ మాత్రం వెనకాడకుండా రూ. 70 కోట్లు గ్రాఫిక్స్ కోసం ఇప్పటికే ఖర్చు చేసారు. గతంలో ఇండియాలో వచ్చిన గ్రాఫిక్స్ ప్రధాన మైన సినిమాలు ‘రోబో', ‘రా.వన్' చిత్రాలకు కూడా ఈ రేంజిలో ఖర్చు పెట్టలేదు.


‘బాహుబలి' సినిమా చూడబోయే ప్రేక్షకులకు ఏది రియల్, ఏ గ్రాఫిక్స్ తెలియనంత అద్భుతంగా ఉండబోతోందట. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు..... ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టులు ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Upcoming Tollywood movie Baahubali trailer to launch in dolby atmos sound.
Please Wait while comments are loading...