‘బాహుబలి’ ట్రైలర్ సంపూర్ణేష్ బాబు వెర్షన్ (వీడియో)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం యావత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.... బాహుబలి ట్రైలర్ విడుదలైనప్పటి నుండి పలు రీమిక్స్ ట్రైలర్లు కూడా యూట్యూబులో హల్ చల్ చేస్తున్నాయి. అవతార్ రీమిక్స్ బాహుబలి ట్రైలర్ తో పాటు, బాలయ్య వెర్షన్ బాహుబలి ట్రైలర్ కూడా నెట్లో హడావుడి చేస్తోంది. బాలయ్య అభిమానులు సైతం బాలయ్య వెర్షన్ బాహుబలి ట్రైలర్ చూసి సూపర్బ్ అంటున్నారు. లెజెండ్ మూవీలోని విజువల్స్ తో బాహుబలి ట్రైలర్ ఆడియో ట్రాక్ దీన్ని రీమిక్స్ చేసారు.
తాజాగా సంపూర్ణేష్ బాబు వెర్షన్ ‘బాహుబలి' వీడియో కూడా విడుదల చేసారు. ఇక ముందు బాహుబలి ట్రైలర్ మీద ఇంకెన్ని వెర్షన్స్ చూడాల్సి వస్తోందో...?


Click it and Unblock the Notifications











