ఈరోజే 'బాహుబలి' ట్రైలర్‌ విడుదల..ఈ లోగా

By Srikanya

హైదరాబాద్‌: శనివారం విడుదలైన 'బాహుబలి' టీజర్‌ అభిమానులను విశేషంగా అలరిస్తూ ఆన్‌లైన్‌లో దూసుకుపోతోంది. ఇక ముందుగా ప్రకటించినట్లుగా సోమవారం ట్రైలర్‌ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ అంతా సిద్ధం చేసింది.

అయితే అంతకంటే ముందుగా సినిమాలో నటించిన రానా, అనుష్క, తమన్నా సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు బాహుబలి చిత్ర విశేషాలను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అనంతరం 5 గంటలకు ట్రైలర్‌ విడుదల చేస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతూ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బాహుబలి' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతోంది. తొలి నుంచి ఈ చిత్ర ప్రచారాన్ని వినూత్నంగా చేస్తున్న దర్శకుడు రాజమౌళి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాహుబలి చిత్రంలోని ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Baahubali Trailer today...details

'బాహుబలి సినిమాకోసం వినియోగించిన వస్తువులతో ప్రత్యేకంగా ఓ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఒక సినిమా కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి. 'బాహుబలి'లో నటీనటులు వాడిన ఆయుధాలు, వాళ్లు ధరించిన దుస్తులు, కవచాలు ఈ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచబోతున్నారు. రాజమౌళి ఆలోచనల మేరకే ఈ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.

ఇక టీజర్ విషయానికి వస్తే...

శనివారం రాత్రి 7.30కి 'బాహుబలి'కి సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు...అభిమానులను ఆనందపరిచారు. 20 సెకన్లపాటు సాగే ఆ టీజర్‌ 'బాహుబలి' సినిమా స్థాయి ఏమిటో చాటి చెబుతోంది. వేలాది మంది సైనికులు పోరాటంలోకి దిగుతుండగా... రానా కత్తి దూసేందుకు సన్నద్ధమవుతూ ఆ టీజర్‌లో కనిపించాడు. చివరిగా ప్రభాస్‌ కళ్లను మాత్రమే చూపించారు. జూన్‌ 1న 2 నిమిషాల ట్రైలర్‌ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X