»   » దేవసేన గా కార్తీక, బాహుబలి టీవీసిరీస్ ప్రోమో చూసారా?? (వీడియో)

దేవసేన గా కార్తీక, బాహుబలి టీవీసిరీస్ ప్రోమో చూసారా?? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి దేవసేన పాత్ర బాహుబలి సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచింది. స్వీటీ దేవసేనగా యంగ్‌లుక్, వయసు ఉడిగిన రెండు పాత్రల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.దేవసేన పేరు తలుచుకోగానే ముందు గుర్తుకొచ్చేది అనుష్కనే. పార్ట్ 1 ఢీ గ్లామర్ రోల్ లో సెకండ్ పార్ట్ లో దేవసేన రాజకుమారి గా ఎంతో అద్భుతంగా తన నటన తో పాటు గ్లామర్ తో కట్టిపడేసిన సంగతి తెల్సిందే.ఇప్పుడు అదే గ్లామర్ పాత్రలో ఇంకోకరు కనిపిస్తే...??? ఎలా రిసీవ్ చేస్కుంటారు? కన్‌ఫ్యూజ్ అవకండీ విషయం ఏమిటంటే...

మహిష్మతిరాజ్యం

మహిష్మతిరాజ్యం

ఫస్ట్ పార్ట్ లో మహిష్మతిరాజ్యం లో బందీగా ఉన్న దేవసేన కనిపించిన సీన్లు మూడు, నాలుగు మాత్రమే. ఈ మూడు, నాలుగు సీన్స్ లో కూడా చేతికి కాళ్లకి సంకెళ్లతో మురికిగా ఉన్న పాత చీరలో అనుష్క కనిపిస్తుంది. డీ-గ్లామరైజ్డ్ రోల్. కానీ సెకండ్ పార్ట్ లో దీనికి పూర్తి భిన్నంగా గ్లామర్ గా కనిపించింది.

అనుష్క తప్ప

అనుష్క తప్ప

మొత్తానికి బాహుబలి లో దేవసేనగా అనుష్క తప్ప మరెవరూ ఆపాత్రని చేయలేరు అన్నంతగా ఆప్ట్ అయిపోయింది అనుష్క అయితే ఇప్పుదు అదే పాత్రలో ఇంకో నటి కనిపించనుంది. దేవసేన గా కార్తీక (మర్చిపోయారా?) నటించనుందట.. ఇదేం బాహుబలి 3 కథ కాదు... ఇంతకీ సంగతేమిటంటే...

కార్తీక

కార్తీక

జోష్‌, రంగం సినిమాల‌తో ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేసింది మాజీ హీరోయిన్ రాధ పెద్ద కూతురు కార్తీక. అయితే.. పాపం ఈ అమ్మ‌డికి స‌రైన అవ‌కాశాలు రాలేదు. వ‌చ్చినా వినియోగించుకోలేకపోయింది. కార్తీక కెరీర్ ఖ‌తం అయిపోతున్న (ఆల్రెడీ అయిపోయింది అంటారు కొందరు) సమయం లో సూపర్ అవకాశం ఒకటి కారెత్త్క ఫ్లాట్ డోర్ కొట్టిందట. అదేమితంటే బాహుబలి లో అనుష్క చేసిన దేవసేన

బుల్లితెర మీద

బుల్లితెర మీద

అయితే కార్తీక చేయబోతోంది వెండితెర మీద కాదు, బుల్లితెర మీద. విజయేంద్రప్రసాద్‌ బుల్లితెరకు అందిస్తున్న ఓ సీరియల్‌లో ‘దేవసేన' పాత్రని కార్తీక చేయబోతోంది. వెండితెర మీద ఎలాగూ సక్సెస్‌ కాలేకపోయిన కార్తీక బుల్లితెర మీదనైనా సత్తా చాటాలని చూస్తోంది. తన తల్లి వారసత్వాన్ని ఏమాత్రం పుణికి పుచ్చుకోలేని కార్తీక బుల్లితెర మీద ఎలా మెప్పిస్తోందో అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ది రైజింగ్ ఆఫ్ శివగామి

ది రైజింగ్ ఆఫ్ శివగామి

తాజాగా బాహుబలి పేరుతో టీవి సీరియల్‌ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. బాహుబలి సినిమాకు తెరపడిందేమో గానీ దాని ప్రస్థానాన్ని మాత్రం మేకర్స్ కొనసాగించబోతున్నారు. బాహుబలి క్యారెక్టర్స్‌తో పుస్తకాల్ని, కామిక్స్ ను, టీవీ సిరీస్ ఇలా రకరకలుగా బాహుబలిని ఒక బ్రాండ్ మార్చాలని బాహుబలి టీం భావిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా "ది రైజింగ్ ఆఫ్ శివగామి" అనే నవలని రాయటం, దాన్ని టీవీ సిరీస్ గా మార్చే పనిలో దిగిపోవటం జరిగింది.

విజయేంద్రప్రసాద్

విజయేంద్రప్రసాద్

అయితే కేవలం శివగామి తోనే ఆగిపోతే ఎలా..? అందుకే ఇప్పుడు బాహుబలి రెండు పార్ట్ లకు కథ అందించిన రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ స్క్రిఫ్ట్ రెడీ చేసారు. దేవసేన లీడ్ రోల్ తో సాగే స్ర్కిఫ్ట్ ఇది. కాగా ఈ స్క్రిఫ్ట్ తో టివి సీరిస్ చేయబోతున్నారు.

ఆరంభ్

ఆరంభ్

ఈ టివి సిరీస్ కి 'ఆరంభ్' టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు. స్క్రిఫ్ట్ నచ్చడంతో ఈ టివి సిరీస్ కోసం దేవసేన పాత్రను చేయడానికి రాధ కూతురు కార్తీక అంగీకరించింది. భారీ బడ్జెట్ తో ఈ టివి సిరీస్ తెరకెక్కనుంది. 'ఆరంభ్' టివి సిరీస్ కోసం కార్తీక ఆల్ రెడీ కత్తిసాము, గుర్రపు స్వారీలు నేర్చుకుంటోందట. సో.. అనుష్క మెరిసిన దేవసేన పాత్రలో మెరవడానికి కార్తీక సిద్ధమవుతోంది.

హిందీ లో చిత్రించి

అదండీ సంగతి మరీ..! కార్తీక కెరీర్ లో దేవసేన అయినా దీపం వెలిగిస్తుందో చూదాలిమరి. ఇప్పటికే ఈ టీవీసిరీస్ లను నేషనల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ముందుగా హిందీ లో చిత్రించి తర్వాత ప్రాంతీయ భాషలలో డబ్ చేస్తామని బాహుబలి నిర్మాత శోభూ యార్లగడ్డ చెప్పేసాడు. ఆలెక్కన కార్తీక కూడా వేరే ఇండస్ట్రీలలో పరిచయం అయితే అక్కడ అయినా అవకాశాలు రావొచ్చు....

English summary
The promo of Baahubali TV adaptation ‘Aarambh’ was released recently. Karthika Nair will be seen playing Devsena, while Tanuja plays Hahuma on the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu