వాలంటైన్ డే: అనుష్క, ప్రభాస్‌లకు ప్రపోజ్ చేయండిలా..!
హైదరాబాద్: వాలంటైన్ డే సందర్భంగా హీరో ప్రభాస్‌కు మీ లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? హీరోయిన్ అనుష్కను వాలంటైన్ డే రోజు డేట్‌కు పిలవాలని అనుకుంటున్నారా? రానాపై మీకు ఎంత ప్రేమ ఉందో చెప్పాలనుకుటున్నారా? అయితే 'బాహుబలి' మూవీ కాంటెస్టులో పాల్గొనండి.

'వాలంటైన్ డే' పురస్కరించుకుని సినిమా ప్రమోషన్లో భాగంగా సరికొత్త కాంటెస్టును లాంచ్ చేసారు యూనిట్ సభ్యులు. బెస్ట్ ప్రపోజల్స్ పంపిన 10 మందికి బాహుబలి టీం నుండి బహుమతులు అందనున్నాయి. విజేతగా నిలవాలంటే మీ ప్రపోజల్ సరికొత్తగా, క్రియేటివ్‌గా ఉండాలి.
పోస్టర్ రూపంలోగానీ, లెటర్ రూపంలోగానీ, వీడియో రూపంలో గానీ.....మీ ప్రపోజల్ ఉండాలి. ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో దీన్ని పోస్టు చేసి #BaahubaliValentine హాష్ టాగ్ ఇచ్చి, బాహుబలి అఫీషియల్ ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ పేజీని దానికి ట్యాగ్ చేయాలి. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు కాంటెస్టు ముగుస్తుంది. ఆ రోజే విజేతలను ప్రకటిస్తారు. మరి ఇంకెందు ఆలస్యం మీ క్రియేటివ్ ఆలోచనలను బయట పెట్టండి.

సినిమా వివరాల్లోకి వెళితే...
ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. బాహుబలి చిత్రంలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. రానా ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.
దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.స


Click it and Unblock the Notifications











