»   » 'శివుడి ' పాత్ర గురించి ప్రభాస్,రాజమౌళి (వీడియో, కొత్త ఫొటోలు)

'శివుడి ' పాత్ర గురించి ప్రభాస్,రాజమౌళి (వీడియో, కొత్త ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'అతను స్వేచ్ఛను కోరుకుంటాడు, సాహసవంతుడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటూ.. తోటి వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు' అని రాజమౌళి ...శివుడు పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

ఇప్పుడు అందరి దృష్టీ రాజమౌళి తాజా చిత్రం బాహుబలి పైనే ఉంది. జులై 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ నేపధ్యంలో చిత్రంలోని పాత్రలపై మరింత ఉత్కంఠ పెంచటానికి రాజమౌళి అండ్ టీమ్ డిఫెరెంట్ గా ప్రమోషన్స్ మొదలెట్టింది.


అందులో భాగంగా...ఈ చిత్రంలోని ప్రభాస్ పోషించిన రెండు పాత్రలలో కీలకమైన శివుడు గురించి మేకింగ్ వీడియో విడుదల చేసారు. ఈ వీడియోలో ప్రభాస్, రాజమౌళి మాట్లాడారు. మీరూ వారు ఏమన్నారో చూడండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


స్లైడ్ షోలో ...ఫొటోలు


రాజమౌళి మాట్లాడుతూ...

రాజమౌళి మాట్లాడుతూ...

చిత్రంలో ప్రభాస్‌ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో 'శివుడు' అనే పాత్ర అత్యంత కీలకమైందని దర్శకుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.


శ్రద్ద తీసుకుని

శ్రద్ద తీసుకుని

ఈ పాత్రను ఎంతో శ్రద్ధ తీసుకుని రూపొందిచామని రాజమౌళి అన్నారు.ప్రభాస్ మాట్లాడుతూ...

ప్రభాస్ మాట్లాడుతూ...


ఈ పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని హీరో ప్రభాస్‌ అన్నారు.


ప్రత్యేక శిక్షణ

ప్రత్యేక శిక్షణ

ఈ చిత్రంలో శివుని పాత్రకు సంబంధించి జలపాతం వద్ద చిత్రీకరించిన సన్నివేశాల కోసం దాదాపు 4 రోజులు కొండలు ఎక్కడంలో ప్రభాస్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.కేరళలో చిత్రీకరణ...

కేరళలో చిత్రీకరణ...

జలపాతం సీన్స్ భాగాన్ని మొత్తం కేరళలో చిత్రీకరించారు.రమా రాజమౌళి మాట్లాడుతూ..

రమా రాజమౌళి మాట్లాడుతూ..

అతని శరీరాకృతికి నప్పేట్లు, గిరిజన సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని వస్త్రాలను రూపొందించామన్నారు.ఇంతకీ 'బాహుబలి' కథేంటి?

ఇంతకీ 'బాహుబలి' కథేంటి?

చిత్రం కథపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఖండనలూ వస్తున్నాయి. ఇది జైనులు ఆరాధించే 'బాహుబలి' కథ అని కొందరంటున్నారు. యుద్ధం నుంచి శాంతికి పరివర్తన చెందిన మహావీరుడి జీవితం నుంచి తీసుకున్నారని మరికొందరు. అయితే, అవేవీ నిజం కాదని ఆంతరంగిక వర్గాల మాట. రాజుల కాలపు ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా - పూర్తిగా కల్పిత కథ.పగ..పోరాటం..

పగ..పోరాటం..

రాజ్యాధికారం కోసం సాగే పోరాటం. పగ, ప్రతీకారం, ప్రేమ, అసూయల మధ్య సినిమా నడుస్తుంది. శివుడుగా, బాహుబలిగా ఇందులో రెండు పాత్రల్ని ప్రభాస్ పోషిస్తున్నారు.ప్రభాస్ మాటల్లో...

ప్రభాస్ మాటల్లో...

''ఇది - రాజులు, రాజ్యాలు, అధికారం కోసం సాగే పోరాటం, యోధానుయోధుల చుట్టూ తిరిగే కాల్పనిక గాథ''.అందుకే బాహుబలి

అందుకే బాహుబలి

బాహువుల్లో అపారమైన బలం ఉన్న వ్యక్తి గనక, అతణ్ణి 'బాహుబలి' అంటారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.


మరి రాజమౌళి మాటల్లో

మరి రాజమౌళి మాటల్లో

... బాహుబలి అంటే ''ది ట్రూ కింగ్'' అని అర్దం. అందుకు తగినట్లే సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు.అనుష్క కనిపించేది కాసేపేనా?

అనుష్క కనిపించేది కాసేపేనా?

ప్రభాస్ వేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్రే ఫస్ట్‌పార్ట్ 'బాహుబలి... ది బిగినింగ్'లో కనిపిస్తుందని ఒక రూమర్ షికారు చేస్తోంది. అదేమిటని ఆరా తీస్తే, రెండు పాత్రలూ ఇందులో కనిపిస్తాయని తెలిసింది.రానా పాత్ర ఇదే..

రానా పాత్ర ఇదే..

బాహుబలిలో హీరో తరువాత హీరో అంతటి ప్రాధాన్యమున్న పాత్ర - భల్లాలదేవ. బాహుబలికి తమ్ముడి వరసయ్యే పరమ దుష్టుడు. ఆ పాత్రను వేస్తున్నది రానా దగ్గుబాటి. సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ మీద నడుస్తుంది. అది అంత పవర్‌ఫుల్ పాత్ర.రానా పాత్ర గురించి ప్రభాస్

రానా పాత్ర గురించి ప్రభాస్

''రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ విలన్ పాత్రల్లో ఒకటవుతుంది. ఆ మాట నమ్మకంగా చెప్పగలను''అని ప్రభాస్ చెప్తున్నారు.తమన్నా పాత్ర ఏంటి

తమన్నా పాత్ర ఏంటి

బాహుబలి ప్రేమికురాలు అవంతిక పాత్రధారిణి-తమన్నా. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమే ప్రధాన హీరోయిన్.అనుష్క పాత్ర ఫస్టాఫ్ లో కొంతే

అనుష్క పాత్ర ఫస్టాఫ్ లో కొంతే

ఇక, అనుష్క పోషించే కీలక పాత్ర దేవసేన. అయితే, ఈ ఫస్ట్ పార్ట్‌లో ఆమె కనిపించేది మాత్రం చాలా కొద్దిసేపేనట! అదీ ఈ మధ్య విడుదల చేసిన వయసు మీద పడ్డ గెటప్‌లోనే అట!సెకండాఫ్ మొత్తం అనుష్కదే

సెకండాఫ్ మొత్తం అనుష్కదే

2016లో వచ్చే 'బాహుబలి' సెకండ్ పార్ట్ (దానికి ఇంకా పేరేదీ ఖరారు చేయలేదు)లో మాత్రం అనుష్క పాత్రదే హవా అని తెలుస్తోంది.హేమా హేమీలు

హేమా హేమీలు

అలాగే, రమ్యకృష్ణ, తమిళం నుంచి నాజర్, సత్యరాజ్, కన్నడం నుంచి 'ఈగ' ఫేమ్ సుదీప్ లాంటి భారీ తారలు ఈ సినిమాలో ఉండనే ఉన్నారు.బహు కష్టం

బహు కష్టం

ప్రీ-ప్రొడక్షన్‌కే... ఆరు నెలల పైగా... 'బాహుబలి' సెట్స్, పాత్రల రూపురేఖలు, దుస్తులు,అలంకరణ లాంటి వాటికి పాతిక మందికి పైగా ఆర్టిస్టులు దాదాపు 15 వేలకు పైగా రేఖాచిత్రాలు గీశారు.ఆయన ప్రతిభే

ఆయన ప్రతిభే

జాతీయ స్థాయిలో పేరున్న ఆర్ట్ డెరైక్టర్ సాబూ శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. బ్రహ్మాండమైన సెట్స్ వేశారు.
రాజమౌళి ఆస్థాన కెమేరామన్ కె.కె. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. కాన్సెప్ట్ స్కెచ్‌ల మొదలు... ఎక్కడ, ఏ సీన్ ఎలా తీయాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్‌లు, ప్రాపర్టీ వాడాలనేది పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొన్నాకే షూటింగ్‌కు వెళ్ళారు. సినిమా ప్రధానంగా ఆర్.ఎఫ్.సి.లో తీశారు. రామోజీ ఫీల్మ్ సిటీలో సెట్స్ వేసి ...సీక్రెట్ గా లాగించేసారు.

English summary
Here is an in-depth look at how the character of Shivudu, played by Prabhas, was brought to life. Baahubali is an upcoming Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam
Please Wait while comments are loading...